Site icon NTV Telugu

హిందువుల‌కు ఆ భూమిని అప్ప‌గించిన పాక్ ప్ర‌భుత్వం…

భార‌త్ పాక్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బోర్డ‌ర్‌లో నిత్యం కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. ఇక పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాల‌యం కూడా నిర్మంచ‌లేదు. 75 ఏళ్ల కాలంలో వంద‌లాది దేవాల‌యాల‌ను కూల్చివేశారు. పాక్‌లో హిందూవులు మైనారిటీలు కావ‌డంతో దేవాల‌యాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయ‌లేని ప‌రిస్థితి.

Read: డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు…

2016లో పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాల‌యం నిర్మాణం కోసం అప్ప‌టి ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. అయితే ఒత్తిళ్ల కార‌ణంగా అప్ప‌టి క్యాబినెట్ ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తీసుకున్న‌ది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖ‌లైంది. 2016 ప్ర‌తిపాధ‌న‌లు తీసుకొచ్చిన ప్ర‌భుత్వం 2017 లో భూమిని సేక‌రించి 2018లో హిందూ పంచాయ‌త్ కు అప్ప‌గించారని, ఆ త‌రువాత ఒత్తిళ్ల కార‌ణంగా తిరిగి భూమిని వెన‌క్కి తీసుకున్నార‌ని సీడీఏ త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. వాద‌న‌లు విన్న హైకోర్టు భూమిని తిరిగి హిందూ పంచాయ‌త్ కు అప్ప‌గించాల‌ని తీర్పునిచ్చింది. దీనిపై హిందువులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version