Site icon NTV Telugu

ఆ అధికారి ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగానే…ఘనీ పారిపోయాడా…!

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌స్తుతం తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చారు.  ఆగ‌స్టు 15 న తాలిబ‌న్లు ఆ దేశాన్ని ఆక్ర‌మించుకున్నారు.  అయితే, తాలిబ‌న్లు కాబూల్ న‌గ‌రంలోకి అడుగుపెట్ట‌క‌ముందే అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ దేశాన్ని వ‌ద‌లి వెళ్లిపోయాడు.  ఘ‌నీ దేశాన్ని విడిచి వెళ్తూ కోట్లాది రూపాయ‌ల‌ను, ఖ‌రీదైన కార్ల‌ను త‌న వెంట తీసుకెళ్లార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.  అయితే, ఈ వార్త‌ల‌ను ఘ‌నీ ఖండించారు.  అవ‌న్నీ అవాస్త‌వాల‌ని, క‌నీసం చెప్పులు తొడుక్కునే స‌మ‌యం కూడా లేద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.  అయితే, ఘ‌నీ హ‌డావుడిగా దేశం వ‌దిలి వెళ్ల‌డానికి ఓ అధికారి ఇచ్చిన త‌ప్పుడు స‌మాచార‌మే అని తెలుస్తోంది.  తాలిబ‌న్లు ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్ర‌మించుకునే స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేస‌ని అధ్య‌క్షుడు ఘ‌నీ, అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు.  ఒప్పందం ప్ర‌కారం తాలిబ‌న్ల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  మ‌ధ్యాహ్నం అధికారులు భోజ‌నానికి వెళ్ల‌గా ఓ అధికారి హ‌డావుడిగా వ‌చ్చి తాలిబ‌న్లు అధ్య‌క్ష భ‌వ‌నంలోకి వ‌చ్చార‌ని, మీకోసం గ‌ది గ‌ది వెతుకుతున్నార‌ని, చెప్ప‌డంతో ఘ‌నీ కంగారుప‌డిపోయారు. గ‌తంలో అధ్య‌క్షుడిని తాలిబ‌న్లు ఎలా చంపారో గుర్తుకు రావ‌డంతో అధికారి చెప్పిన మాట‌లు నిజ‌మే అని న‌మ్మి వెంట‌నే దేశం హెలికాఫ్ట‌ర్ ద్వారా ఉజ్బెకిస్థాన్ వెళ్లిపోయారు.  అక్క‌డి నుంచి మ‌రో విమానం ద్వారా యూఏఈకి వెళ్లారు ఘ‌నీ. ఆ త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌కుంటే ఈరోజు ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితులు వేరే విధంగా ఉండేవేమో… 

Read: భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త క‌రోనా వేరియంట్‌…

Exit mobile version