NTV Telugu Site icon

రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు

సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.

Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఫిలిప్పీన్స్ యాక్టర్​, కమెడియన్ పాలో బల్లెస్టెరోస్​ ఏకంగా 1 గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పకుండా రికార్డు సృష్టించాడు. కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా ఉన్న పాలో ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ‘నో బ్లింకింగ్​ ఛాలెంజ్’లో పాల్గొని రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా వరల్డ్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటుకు అర్హత సాధించాడు. గిన్నిస్ రికార్డుల్లో కూడా ఇంతవరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. గతంలో కొలరాడోకు చెందిన జులియో జైమ్ అనే వ్యక్తి కళ్లు ఆర్పకుండా 1 గంట 5 నిమిషాల 11 సెకన్లు ఉన్నాడు. అతడు 2016లో ఈ ఫీట్ సాధించాడు.