NTV Telugu Site icon

Gopal Italia: గుజరాత్ లో ఆప్ నేత అరెస్ట్.. భయం లేదన్న ఇటాలియా

Gopal Italia

Gopal Italia

గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గోపాల్ ఇటాలియాను సూరత్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. అరెస్టయిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలలో ఒకరిగా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలిచిన ఇటాలియా.. రాష్ట్ర హోం మంత్రిని డ్రగ్స్ సంఘవి అని తిట్టినట్లు బీజేపీ ఆరోపించింది. ఇటాలియా గౌరవప్రదమైన వ్యక్తిని పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:Avinash Reddy : అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

అయితే, బీజేపీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పనితీరు చూసి షాక్ తిన్న బీజేపీ ఇటాలియాను అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా అంతమొందించాలి అన్నదే బీజేపీకి లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ వ్యక్తులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా జైల్లో పెడతారని ఢిల్లీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో సాక్షిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేజ్రీవాల్ ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది.ఇదే కేసులో ఆయన మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియాను గతంలో అరెస్టు చేశారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చూపినప్పటి నుంచి… అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించాలని చూస్తోందని ఆప్ నేత ఇటాలియా అన్నారు. జైలుకు, విచారణకు తమకు భయం లేదని, ఎలాగైనా పోరాడుతూనే ఉంటాం.. గెలుస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read:Yo Yo Honey Singh: హీరోయిన్‌తో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్.. వీడియో వైరల్

కాగా, 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ఆప్ కేవలం ఐదు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. సూరత్‌లోని కతర్గాం స్థానం నుంచి పోటీ చేసిన ఇటాలియా ఓడిపోయారు. ఆప్‌కి ఇటీవలే జాతీయ పార్టీ హోదా కూడా వచ్చింది.

Show comments