Site icon NTV Telugu

విశాఖలో మరో కీచకుడు.. మహిళా ఉద్యోగి పట్ల వెకిలి చేష్టలు..

harassment 1

ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లు మాత్రం భయపడడం లేదు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే తాజాగా మరో కీచకుడి ఉదంతం బయట పడింది. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఎలక్ట్రికల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. గత మూడు నెలల క్రితం బదిలీపై వచ్చిన ఓ మహిళా సబ్‌ ఇంజనీర్‌ను లైంగికంగా వేధించాడు.

ఏఈ వెకిలి చేష్టలు శృతిమించడంతో సదరు మహిళా సబ్‌ ఇంజనీర్‌ కుటుంబసభ్యులతో ఆఫీసుకు వచ్చి ఏఈకి దేహశుద్ది చేసింది. అంతేకాకుండా ఏఈని పోలీసులకు బాధిత మహిళ కుటుంబ సభ్యులు అప్పజెప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. స్థానిక నాయకులు ఈ విషయంలో కలుగజేసుకొని రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version