పెళ్లి అనేది ఒక మధురానుభూతి. పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. బాజాలు భజంత్రీలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని అనుకుంటారు. దీనికోసం పెద్ద ఉత్సవం మాదిరిగా చేస్తారు. గుజరాత్‌లో పెళ్లిళ్ల సమయంలో బరాత్ ను నిర్వహిస్తుంటారు. పెళ్లి కుమారుడిని గుర్రపుబండిలో కూర్చోపెట్టి ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి పెళ్లి రోజు అనుకోకుండా ఓ విషాదం చోటుచేసుకుంది.
Read: ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది…
పెళ్లికొడుకును ఊరేగింపుగా గుర్రం బండిలో తీసుకెళ్తుండగా… ముందు బాణసంచా కాలుస్తున్నారు. అయితే, అనుకోకుండా టపాసులు గుర్రపు బండిలో పడింది. గుర్రపు బండిలో పడ్డ టపాసులు పేలడంతో అందులో ఉన్న బాణసంచా పేలింది. క్షణాల్లో బండి మొత్తం మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నీళ్లు చల్లి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన చిన్నవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
