కన్న బిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సి తల్లి నవజాత శిశువును నిర్ధాక్షిణ్యంగా అమ్మేందుకు సిద్దమైంది. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో నవజాత శిశువును పుట్టిన వెంటనే అమ్మేసింది ఓ తల్లి. ఈ కేసుకు సంబంధించి నవజాత శిశువు తల్లి ఆశాదేవి సహా 11 మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లితే… హజారీబాగ్ జిల్లాలోని బద్కాగావ్ గ్రామానికి చెందిన దంపతులతో చత్రా, బొకారోకు చెందిన ఇద్దరు బ్రోకర్లు నవజాత శిశువు కోసం రూ.4.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read: Pooja Ceremony: ‘రేవ్ పార్టీ’కి క్లాప్ ఇచ్చిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ నిర్మాత!
పాప తల్లికి రూ.లక్ష ఇవ్వగా, మిగిలిన రూ.3.5 లక్షలు బ్రోకర్లు పంచుకున్నారు. చత్రా డిప్యూటీ కమిషనర్ అబూ ఇమ్రాన్ ఘటనపై సమాచారం అందుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లోనే బొకారో జిల్లా నుంచి నవజాత శిశువును రక్షించారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అవినాష్ కుమార్ తెలిపారు. ఆశాదేవి నుంచి లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డింపుల్ దేవి అనే మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఇతర నిందితులను పట్టుకుని, బొకారో నుండి శిశువును రక్షించారని పోలీసులు తెలిపారు. సదర్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ లాల్ వాంగ్మూలంపై ఛత్ర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
