ఏ వయసులోనైనా తోడు లేకుండా జీవించడం చాలా కష్టం. అందుకే తొలి వయసులో కంటే మలి వయసులో తోడు కోరుకుంటారు. మొదటి నుంచి తన కష్టాన్ని నమ్ముకొని చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెళ్లిల్లు చేసిన షఫీ అహ్మద్ అనే 90 ఏళ్ల పెద్దాయనకు పెళ్లి చేయాలని అనుకున్నారు కుమార్తెలు. అనుకున్నదే తడవుగా 75 ఏళ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వారి వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. చాలా కాలం క్రితమే భార్య చనిపోవడంతో 90 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న తండ్రిని చూసి కుమార్తెలు చాలా బాధపడ్డారు. తండ్రికి తోడుగా ఎవర్నైనా ఉంచినా సరిగా చూసుకోరని చెప్పి ఆయనకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నామని, తండ్రి విషయాలు తెలిసిన అయేషాను ఇచ్చి వివాహం జరిపించామని తెలిపారు. చివరి దశలో తన తండ్రిని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుందని చెబుతున్నారు ఆ కూతుళ్లు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జనపథ్ రామ్‌పూర్ పరిధిలో జరిగింది.
Read: పంజ్‌షీర్ తాలిబన్ల కైవసం…