NTV Telugu Site icon

వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన డ్రైవర్‌ దస్తగిరి కొన్ని రోజుల క్రితం అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఎలా.. ఎవరు హత్య చేశారో కూడా వాగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ దస్తగిరి వాగ్మూలమిచ్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని తేలితే.. 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామంటూ వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇరికించాలని చూస్తోందన్నారు.