దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా టమోటా పంట నాశనమైంది. దీంతో టమోటా ధరలు ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. దేశంలో టమోటా ధర రూ.67 ఉన్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 63శాతం అధికమని, భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానే ధరలు పెరిగినట్టు తెలియజేసింది. ఇక ఉత్తర భారతదేశంలో టమోటాల దిగుబడి డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతాయని, ఈ దిగుబడుల అనంతరం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే, ధరల స్థీకరణ నిధి నుంచి రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్టు కేంద్రం తెలియజేసింది.
Read: దిగొస్తున్న తాలిబన్లు… భారత దేశానికి అగ్రతాంబూలం…పాక్ చైనాలకు షాక్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం వాటా కింద రూ. 164.15 కోట్లు అందించినట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కర్నూలు మార్కెట్‌కు టమోటా రావడంతో నిన్నటి వరకు కిలో వంద పలికిన టమోటా ఇప్పుడు భారీగా తగ్గిపోయింది.
