ఇండియాలో కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ప్రతి రోజు 3 లక్షల కేసులు నమోదవు తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,57,72,400 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గకముందే.. బ్లాక్ ఫంగస్ ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో వ్యాధి ఇండియాను టెన్షన్ పెడుతోంది. తాజాగా పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు కొద్దిరోజుల కిందట వైట్ ఫంగస్ బారిన పడినట్లు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల సంక్రమనకు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) ప్రధాన కారణమని చెబుతున్నారు. ఊపిరితిత్తులతో పాటు చర్మం , గోర్లు, నోటి లోపల భాగం, కడుపు మరియు పేగు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడు మొదలైన వాటికి కూడా ఇది సోకుతుందని వెల్లడించారు.
ఇండియాకు మరో టెన్షన్.. వైట్ ఫంగస్ కలకలం..!
