Site icon NTV Telugu

Shooting Thailand: థాయ్‌లాండ్‌లో ఫైరింగ్.. కాల్పుల్లో నలుగురు మృతి

Thailand

Thailand

దక్షిణ థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణంగా దాదాపు 600 కిమీ దూరంలో సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ లో సాయంత్రం 5 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. నిందితుడి కోసం అధికారులు ఇంకా వెతుకుతున్నారు. ఘటప స్థలంలోనే నలుగురు వ్యక్తులు మరణించారు. మాజీ గ్రామపెద్ద ఇంటి దగ్గర కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Also Read: Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు

థాయ్‌లాండ్‌లో తుపాకీ కల్చర్ ఎక్కువ. గత 12 నెలల్లో హింసాత్మక సంఘటనలు చాలా జరిగాయి. అయితే, తాజా ఘటన ఇటీవలి జరిగిన దారుణ ఘటనల్లో అత్యంత ఘోరమైంది. అక్టోబరులో ఈశాన్య నాంగ్ బువా లామ్ ఫు ప్రావిన్స్‌లో మాజీ పోలీసు సార్జెంట్ 36 మందిని హత్య చేశారు. వారిలో 24 మంది పిల్లలు కూడా ఉన్నారు. గత నెలలో, పెట్చబురి ప్రావిన్స్ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

Exit mobile version