Site icon NTV Telugu

ఇంటి నిర్మాణాల కోసం స‌రికొత్త టెక్నాల‌జీ… త‌క్కువ సమయంలో కాల‌నీల ఏర్పాటు…

సాంకేతికంగా ప్ర‌పంచం అభివృద్ధి ప‌దంలో దూసుకుపోతున్న‌ది.  రాకెట్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఇత‌ర గ్ర‌హాల‌మీద‌కు వెళ్లేందుకు మ‌నిషి ప్ర‌య‌త్నిస్తున్నాడు.  త్రీడీ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చి అవ‌స‌ర‌మైన సాధ‌నాల‌ను త‌యారు చేసుకుంటున్నాడు.  మ‌నిషి ఎన్ని సాధించినా నివ‌శించాలి అంటే ఇల్లు ఉండాలి.  ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఎంత స‌మ‌యం, ఖ‌ర్చు అవుతుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  స‌మ‌యాన్ని, ఖ‌ర్చును త‌గ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న  3డీ టెక్నాల‌జీని వినియోగించుకుంటున్నాడు.  

Read: రాష్ట్ర‌ప‌తికి అరుదైన గౌర‌వం… చీరకొంగుతో దిష్టితీసిన జోగ‌తి…

3డీ టెక్నాల‌జీతో గృహాల‌ను నిర్మించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.  ఇట‌లీకి చెందిన ఓ సంస్థ ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేయ‌కుండా మ‌ట్టి స‌హాయంతో 3డీ ప్రింటింగ్‌తో ఇంటిని నిర్మించ‌వ‌చ్చ‌ని నిరూపించింది.  దీనికి టెక్నాల‌జీ, క్లే ప‌దాలు రెండింటిని క‌లిపి టెక్లా నూత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేసింది.  3డీ ప్రింటింగ్ ద్వారా స‌ముద్రం తీరం నుంచి సేక‌రించిన మ‌ట్టితో ఇంటిని నిర్మించారు.  60 చ‌ద‌ర‌పు మీట‌ర్ల వైశాల్యంలో ఇంటిని నిర్మించారు.  200 గంట‌ల్లో 6 కిలోవాట్ల విద్యుత్‌తో ఇంటిని నిర్మించారు.  స‌మ‌యంతో పాటుగా ఖ‌ర్చుకుడా 30 శాతం వ‌ర‌కు త‌గ్గిపోయింది.  కాగా, ఇప్పుడు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 3డీ ప్రింటింగ్ స‌హాయంతో కాల‌నీలు ఏర్పాటు చేయ‌బోతున్నారు. వంద ఇళ్ల‌తో కూడిన కాల‌నీని ఏర్పాటు చేస్తున్నారు.  ఒక్కో ఇల్లు 300 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.  ఇక ఒక్కో ఇంటిపై విద్యుత్ కోసం సోలార్ ప్లేట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ కాల‌నీల నిర్మాణం పూర్త‌యితే ప్ర‌పంచంలో తొలి 3డీ కాల‌నీగా రికార్డ్ సాధిస్తుంది.  

Exit mobile version