యూరప్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వీరలెవల్లో వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ ప్రారంభమైనప్పటికీ యూరప్‌లో దీనికి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్నది. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 3201 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 14,909కి చేరింది.
Read: ఇంటర్ ఫలితాలపై బోర్డ్ కీలక వ్యాఖ్యలు…
ప్రపంచం మొత్తం మీద అత్యథిక సంఖ్యలో కేసులు నమోదైన దేశం బ్రిటన్ అని చెప్పాలి. మొన్న ఒక్కరోజులో వెయ్యికిపైగా కేసులు నమోదైతే, 24 గంటల్లో ఆ సంఖ్య డబుల్ అయింది. యూకేలో ఒక్కరోజులో 88 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 146 మంది మృతి చెందారు. బ్రిటన్‌లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
