NTV Telugu Site icon

స్మార్ట్‌ఫోన్ ఎఫెక్ట్‌: గ‌తం మ‌ర్చిపోయిన యువ‌కుడు…

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత తిండి నిద్ర‌ను ప‌క్క‌న పెట్టి ఫోన్‌లో కాల‌క్షేపం చేస్తున్నారు.  సెల్‌కు బానిస‌లైపోతున్నారు.  దీంతో లేనిపోని జ‌బ్బులు తెచ్చుకొని ఇబ్బందులు ప‌డుతున్నారు.  స్మార్ట్‌ఫోన్ కు బానిస‌లైతే కొంత‌మంది వారి గ‌తాన్ని కూడా మ‌ర్చిపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇలానే స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన ఓ యువ‌కుడు త‌న గ‌తాన్ని మ‌ర్చిపోయాడు.  దీంతో భ‌య‌పడిన త‌ల్లిదండ్రులు వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.  ఈ సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో జ‌రిగింది.  

Read: దేశంలో మ‌రో చ‌ట్టం రద్దు…

రాజ‌స్థాన్‌లోని చూరు జిల్లాలోని సహ్వా టౌన్‌కు చెందిన 20 ఏళ్ల అక్రామ్ అనే వ్య‌క్తి ఎల‌క్ట్రిక్ వైండింగ్ షాపును నిర్వ‌హిస్తున్నాడు.  నిత్యం వైండింగ్ ప‌నుల‌తో బిజీగా ఉండే అక్రామ్ హ‌టాత్తుగా స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయాడు.  దీంతో గ‌త నెల రోజులుగా అక్రామ్ ప‌నికి వెళ్ల‌కుండా స్మార్ట్‌ఫోన్‌తోనే కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టాడు.  గ‌త కొన్ని రోజులుగా రాత్రీ, ప‌గ‌లు తేడా లేకుండా నిత్యం మొబైల్ ఫోన్‌లోనే కాల‌క్షేపం చేస్తున్నాడ‌ని, తిండి తిన‌డం కూడా మానేశాడ‌ని, దీంతో ప‌రిస్థితి సీరియ‌స్ కావ‌డంతో వెంట‌నే ఆ యువ‌కుడిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.  క‌నీసం త‌ల్లిదండ్రుల‌ను కూడా గుర్తుప‌ట్ట‌లేని స్థితికి వెళ్లిన‌ట్టు వైద్యులు చెబుతున్నారు.