రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలొని అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా భారత గనులశాఖ గుర్తించింది. రాయగిరి సమీపంలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ కు గనులు ఉండేవి. అయితే, 2001 నుంచి గనుల తవ్వకాలను నిలిపివేశారు. అయితే, ఇప్పుడు ఈ గనులకు సమీపంలో మరో రెండు ప్రాంతాల్లో, రొద్దం మండలంలోని బొక్సంపల్లిలోని రెండు ప్రాంతాల్లో, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో 6 ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా గుర్తించారు. గనులు ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో ఒక టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం ఉందని గనుల శాఖ స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో గుర్తించిన బంగారు గనుల్లో మొత్తం 16 టన్నుల బంగారం ఉంటుందని గనులశాఖ పేర్కొన్నది. భూగర్భగనులుగా వీటిని తవ్వేందుకు వీలు అవుతుందని, త్వరలోనే తవ్వకాలకు లైసెన్సలు జారీచేసే అవకాశం ఉన్నట్టు గనులశాఖ పేర్కొన్నది.
Read: సెల్ఫ్ ఐసోలేషన్‌లో పుతిన్…సైబీరియాలో ఇలా…