Site icon NTV Telugu

తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరిగి పోతుంది. తాజాగా తెలంగాణ లో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని వైద్య శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కి చేరింది. విదేశాల నుంచి వ‌చ్చిన 10 మందికి.. ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

రిస్క్ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చిన ఇద్ద‌రికీ కొత్త వేరియంట్ వచ్చింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 కు చేరింది. ఇక అటు కొత్త‌గా మ‌హారాష్ట్ర‌లో 8 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో నాలుగు ముంబైలో, మూడు స‌తారాలో ఒక‌టి పూణేలో న‌మోద‌య్యాయి.  కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం న‌మోదైన కేసుల సంఖ్య 48కి చేరింది.  

Exit mobile version