Site icon NTV Telugu

గుజ‌రాత్‌లో క‌డ‌లి క‌ల్లోలం… మునిగిపోయిన 12 బోట్లు…

గుజ‌రాత్‌లో క‌డ‌లి క‌ల్లోలం సృష్టించింది.  దీంతో 12 మ‌త్స్య‌కారుల బోట్లు స‌ముద్రంలో మునిగిపోయాయి.  12 బోట్ల‌లో మొత్తం 23 మంది మ‌త్స్య‌కారులు ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు.  ఇందులో 11 మందిని సుర‌క్షితంగా కాపాడు.  మిగ‌తా 12 మంది మ‌త్స్య‌కారుల కోసం అధికారులు గాలిస్తున్నారు.  మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి వాతార‌వ‌ణంలో మార్పులు వ‌స్తున్న నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ‌, అధికారులు మ‌త్స్య‌కారుల‌ను హెచ్చరిస్తూ వ‌స్తున్నారు.  జాల‌ర్లు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు.  

Read: ఇలాంటి పెళ్లి ప‌త్రికను ఎక్క‌డా చూసుండ‌రు…!!

అయిన‌ప్ప‌టికీ మ‌త్స్య‌కారులు వాటిని ప‌ట్టించుకోకుండా చేప‌ల వేట‌కు స‌ముద్రంలోకి వెళ్లారు.  అయితే, స‌ముద్రంలో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది.  గిర్‌-సోమ‌నాథ్ ప్రాంతంలో బ‌ల‌మైన ఈదురు గాలులు వీయడంతో స‌ముద్రంలోకి ప‌డ‌వ‌లు మునిగిపోయాయి.  మ‌రోవైపు ద‌క్షిణ గుజ‌రాత్ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి.  ప‌ట్ట‌ప‌గ‌లే చిమ్మచీక‌ట్లు క‌మ్ముకోవ‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు.  

Exit mobile version