చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. హోండా యాక్టివాపై 117 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.3 లక్షలకు పైగా ఉన్నది.
Read: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్…
చలాన్లు కట్టకుండా తిరుగుతున్న హోండా యాక్టివా యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా రూల్స్ పాటించాలని, వాహనాలపై చలాన్లు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. చలాన్లు కట్టకుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.