ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. రాష్ట్రంలో ఒకేసారి 10 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో… ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు పెరిగింది.. అయితే బాధితులంతా ఆరోగ్యంగా ఉన్నారని.. ఐసోలేషన్‌లో ఉంచినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ఆరోగ్యశాఖ..
ఇక, కొత్తగా నమోదైన ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. అందులో 41 ఏళ్ల మహిళ ఈ నెల 21వ తేదీన కువైట్ నుంచి పశ్చిమ గోదావరికి వచ్చారు. 48 ఏళ్ల వ్యక్తి నైజీరియా నుంచి 18న గుంటూరుకు రాగా.. 50 ఏళ్ల వ్యక్తి 14న సౌదీ అరేబియా నుంచి తూర్పు గోదావరికి వచ్చారు. ఇక, అతడితో కాంటాక్ట్ అయిన ఓ వ్యక్తి, మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. 21వ తేదీన యూఎస్ నుంచి చిత్తూరు వచ్చి 28 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలగా.. 18న యూఎస్ నుంచి అనంతపురం వచ్చిన 22 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ సోకింది.. అతడితో కాంటాక్ట్ అయిన 17 ఏళ్ల అమ్మాయికి పాజిటిగ్‌గా తేలింది.. ఇక, 20న యూఏఈ నుంచి కర్నూలు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి, అదే రోజు కర్నూలు వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్టుగా తేల్చారు అధికారులు. మరోవైపు.. బాధితులతో కాంటాక్ట్ అయినవారి శాంపిల్స్‌ను సేకరించి టెస్టింగ్‌కు పంపించినట్టు అధికారులు ప్రకటించారు.
