టీ-20 సిరీస్ వైట్‌వాష్‌పై కన్నేసింది రోహిత్‌సేన. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా…చివరి ఫైట్‌కు రెడీ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత టెస్టు ప్రారంభం కానుండటంతో కొన్ని ప్రయోగాలు చేయనుంది. సొంత గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. టీ-20 సిరీస్‌లో ఇప్పటికే రెండింటిలో గెలిచిన సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇదే. అదే ఊపుతో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.న్యూజిలాండ్ ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడింది.
కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి, వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని తాపత్రయం పడుతోంది. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, కివీస్ తలపడనున్నాయ్. ఫామ్ చూస్తుంటే…రెండు టీమ్‌లు బలంగా కన్పిస్తున్నాయ్. ఐతే టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంది.ఇక మూడో మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలని డిసైడయ్యింది. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్.. ప్రయోగాల్లో తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ నెల 25 నుంచి కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
దాంతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నాడు. వారి స్థానంలో కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నాడు. ఏకంగా నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అతడి స్థానంలో గైక్వాడ్‌ను తీసుకోవాలని భావిస్తోంది. రోహిత్‌శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2021 సీజన్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన గైక్వాడ్‌కు ఇదే తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఆడే అవకాశం ఉంది. రిషభ్ పంత్‌కు విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో ఇషాన్‌ను తీసుకోవాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రిషభ్ పంత్..ఇదే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మొదలైనప్పటి నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతోన్న పంత్‌కు రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ఇక బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ లేదా దీపక్ చాహర్‌లల్లో ఒకరికి రెస్ట్ ఇచ్చి, అవేష్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్ ట్విన్స్ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు బదులుగా చాహల్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది మేనేజ్‌మెంట్.
