NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

మాస్టర్‌ ప్లాన్‌ పై ముగిసిన సమావేశం.. 11న రైతు జే.ఏ.సి. ధర్నా

కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి. సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ ప్రకటన పై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రైతులు. మాస్టర్ ప్లాన్ రద్దుకు కౌన్సిల్ తీర్మాణం చేయాలని కౌన్సిలర్లను కోరాలని, 11న మున్సిపాలిటీ ఎదుట రైతు జే.ఏ.సి. ధర్నా చేయాలని తీర్మానం చేశారు రైతులు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటనను వెల్లడించారు. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేయవద్దు, అద్దాలు ధ్వంసం, విధ్వంసం చేయవద్దని రైతు జే.ఏ.సి. హెచ్చరించింది.

ప్రిన్సిపల్‌, వార్డెన్‌, అటెండర్‌ వేధిస్తున్నారు.. రోడ్డెక్కి విద్యార్థినిలు ఆందోళన

విద్యార్థినులపై వేధింపులు, దురుసుగా ప్రవర్తించడం పై ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వారికి వార్నింగ్‌ లు ఇస్తున్నా.. అయినా వారిపై స్కూల్‌ యాజమాన్యం మాత్రం అలానే ప్రవర్తిస్తూ.. నరకయాతన చూపిస్తున్నారు. వారిని వేధిస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులు ఎదురు తిరిగితే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ నరకాన్ని చూపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన విద్యార్థినులు రోడ్డెక్కారు. న్యాయం జరగేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. ఈఘటన దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద చోటుచేసుకుంది.

ఫంక్షన్ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

దేశంలోని రహదారులు నిత్యం రక్తమోడుతూనే ఉన్నాయి. వాహనం అదుపు తప్పడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్నపాటి అలసత్వం ఏం కాదులే అనేంతగా అజాగ్రత్త కూడా ప్రాణాలను బలిగొంటుందని చాలా నివేదికలు పేర్కొన్నాయి. అయినా ఈ ప్రమాదాలు ఆగడం లేదు. నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందడం విషాదం నెలకొంది.

ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం వైజాగ్ కు బయలు దేరిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లు విశాఖ‌లోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. కానీ విశాఖ పోలీసులు చిరంజీవికి, ఆయ‌న అభిమానుల‌కు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేద‌ని విశాఖ సీపీ తేల్చిచెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఈవెంట్ నిర్వహించుకుంటామని అడిగారని, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేడుక జరుపుకోవాలని చెప్పామని వివరించారు. చిత్రబృందం సమర్పించిన దరఖాస్తుకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. సాయంత్రం వైజాగులో జరిగే వేడుక చిరంజీవి, రవితేజ హైదరాబాదునుంచి బయలుదేరారు. శంషాబాదు ఎయిర్ పోర్టులో వేదిక మార్పుపై అడిగిన ప్రశ్నకు వారికి ఉన్న వీలును బట్టి పర్మీషన్ ఇస్తారని చిరంజీవి అన్నారు.

పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!

హైదరాబాద్‌లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అయిన భేటీ అయిన సంగతి తెలిసిందే! కుప్పం ఘటనపై చంద్రబాబుని పరామర్శించేందుకు పవన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో వీళ్లిద్దరు జీవో నం.1పై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే.. వీరి భేటీపై వైసీపీ నాయకుల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విటర్ మాధ్యమంగా వీరి భేటీపై స్పందిస్తూ.. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబుకి వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెళ్లాడంటూ సెటైర్స్ వేశారు. అలాగే.. మంత్రి అంబటి రాంబాబు సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దలు వెళ్తాయని.. ఇక్కడ చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ బసవన్నలా తల ఊపడానికి వెళ్లాడని చురకలంటించారు.

పవన్, చంద్రబాబు భేటీపై కౌంటర్.. ఇదొక అపవిత్ర కలయిక

జనసేన అధిపతి పవన్ కల్యాన్, టీడీపీ అధినేతి చంద్రబాబు తాజా కలయికపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదొక అపవిత్ర కలయిక అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరి కలయిక వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి.. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారని మండిపడ్డారు. అయితే.. 2019లో వైసీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడతాడు కాబట్టే పవన్‌ను తాము దత్తపుత్రుడు అంటామన్నారు. దత్తపుత్రుడు అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ అంటున్నాడని, మరి ఇప్పుడు చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో పవన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుతో పవన్ భేటీ.. అందుకోసమేనా?

జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన ఇంట్లో భేటీ కానున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుప్పం ఘటనపై చంద్రబాబుని పవన్ పరామర్శించినట్టు తెలుస్తోంది. గతంలో విశాఖపట్నంలో పవన్‌కి చేదు అనుభవం ఎదురైనప్పుడు.. ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. ఇప్పుడు తన పర్యటనలో భాగంగా చంద్రబాబుకి ఎదురైనా పరిణామాల దృష్ట్యా ఆయన్ను పరామర్శించేందుకు కలవనున్నట్టు తెలుస్తోంది.

ఆ పని చేస్తే.. తారక్ టీడీపీలోకి తప్పకుండా వస్తాడు

జూ. ఎన్టీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు? అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే! ఓవైపు అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు తారక్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇంతకుముందు అతడు టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తారక్ రీఎంట్రీ ఇస్తే.. టీడీపీకి అతని క్రేజ్ కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తారక్ మాత్రం ఇప్పుడిప్పుడే రాజకీయాలవైపు అడుగులు వేయాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం తన సినీ కెరీర్ మీదే అతడు పూర్తి దృష్టి సారించాడు. గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలోనూ తనకు రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని, ఇప్పుడు కేవలం సినిమాల మీదే ఫోకస్ పెట్టానని క్లారిటీ ఇచ్చేశాడు.

ఇంట్లో ప్లేస్‌ లేదా తల్లీ.. మెట్రోలో ఆడుకుంటున్నావ్‌..

మెట్రో రైలులో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తాడు? కూర్చుని ఫోన్‌లో బ్రౌజ్ చేస్తూ ఉండండి లేదా సహ-ప్రయాణికులతో మాట్లాడండి లేదా వారి గమ్యస్థానం కోసం వేచి ఉండటం.. కానీ ఈకాలం యువత అడపదడప రీల్స్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు. రీల్స్‌ చేయడానికి ఒక ప్లేస్‌ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్‌ చేసేందుకు వెనకాడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఓ యువతి విచిత్రమైన వికృత చేష్టలు చేసి ఆ వీడియోను సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు సీరియస్‌ అవుతున్నారు. మెట్రో అంటే గమ్యస్థానానికి చేర్చడం అంతేగానీ.. మెట్రోలో ఈ వెకిలి చేష్టలేంటని మండిపడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంటల్లో స్థలం లేదా? నీకు ఆడుకోవడానికి మెట్రోనే దొరికిందా? సోయలేకుండా ఆ వెకిరిచేష్టలు ఏంటి? కెమెరాలను చూస్తూ కూడా భయంలేకుండా ముద్దులు పెట్టడం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. చదువులో విద్యార్థులు మరింతగా రాణించేందుకు మన దేశంలో ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టాపర్‌లకు ఉచిత విమాన, రైలు, రోడ్డు ప్రయాణాన్ని ప్రకటించారు. దానిని నిజం చేసి కూడా నిరూపించారు.

వేటగాళ్ల ఉచ్చుకు మరో ఏనుగు బలి

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి చెందింది. శనివారం రాత్రి మహాసముంద్‌లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది. ఈ ఘటన జనవరి 7వ తేదీ రాత్రి జరిగింది. పెట్రోలింగ్ బృందానికి సమాచారం అందగానే వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు అటవీ సిబ్బంది అక్కడు చేరుకుని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడే ముఠా చురుకుగా ఉంటుంది.

అజిత్ సినిమాను బ్యాన్ చేసిన సౌదీ అరేబియా ?

జిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘తునివ్’. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడిగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా విడుదలపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. లింగమార్పిడి పాత్రలు, ఇస్లాం వ్యతిరేకత, మితిమీరిన హింసతో కూడిన సన్నివేశాలు నిషేధానికి కారణమని తెలుస్తోంది. ఇతర గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా సెన్సార్ కాలేదు. ఇది పూర్తయితే కువైట్, ఖతార్ వంటి దేశాల్లో కూడా నిషేధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్

హీరోయిన్లు సాధారణంగా మేకప్ లేకండా బయటకు రారు. ఒక వేళ వస్తే తమ లుక్, స్టైల్ గురించి ఎప్పుడూ అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. మేకప్ లేకుండా చాలా మంది హీరోయిన్లను గుర్తించడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్మిక మందన్న నో మేకప్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక లుక్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ‘పుష్ప’ ఫేమ్ నటి రష్మిక మందన్న ఇటీవల విమానాశ్రయంలో కనిపించింది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా వారి స్టైల్‌తో ఫోటో గ్రాఫర్లనే కాదు అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నారు రష్మిక. ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మేకప్ లేని లుక్‌లో కనిపించింది. రష్మిక సింప్లిసిటీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సమయంలో, ఫోటోగ్రాఫర్‌లు ఆమె మాస్క్ తీసి ఫోజు ఇవ్వమని కోరారు. ఆమె ఏ మాత్రం సంకోచించకుండా పూర్తి విశ్వాసంతో సాధారణ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.
China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్