NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు నిజామాబాద్ కు సిఎం రేవంత్.. డిఎస్ భౌతిక కాయానికి నివాళులు..
నేడు నిజామాబాద్ జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డి.ఎస్. భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. 9:15 గంటలకు ఆయన తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 9: 30 బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరానున్నారు సిఎం. 10:30 కు నిజామాబాద్ కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు సిఎం చేరుకుంటారు. 10 :45 కు డి. శ్రీనివాస్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన డి.ఎస్. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. తిరిగి మళ్లీ 11 గంటలకు తిరుగు ప్రయాణం చేయనున్నారు సీఎం. నిజామాబాద్ లో నేడు డి.శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం ప్రగతి నగర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ రోడ్డులోని డి.ఎస్. సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

ఉట్నూర్ లో నేడు మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..
బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొదటగా ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరలిస్తున్న మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. దాంతో రమేశ్ రాథోడ్ మృతదేహనన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేసారు. ఇక రమేశ్ రాథోడ్ రాజకీయ ప్రస్థానంలో 1999లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపొంది., ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. తిరిగి మళ్లీ 2014లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేశారు. ఇక చివరగా 2021లో ఈటల రాజేందర్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఇక బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఈ రోజు ఆదివారం నాడు ఉదయం 10 : 30 గంటలకు జరుగుతాయి. ఉట్నూర్ లోని వారి నివాసం నుండి ప్రారంభమై X రోడ్ ( నాగపూర్ ) చౌరస్థ లోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి హౌస్ అరెస్టు
తిరుపతి జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమైయ్యారు. అయితే, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పర్యటనకు వెళ్తే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పుంగనూరు రాకుండా టీడీపీ ఇన్ చార్జ్ చల్లా బాబు అడ్డుకున్నారు. ఇక, రెండు రోజుల క్రితం 13 మంది పుంగనూరు కౌన్సిలర్లు సహా ఛైర్మన్‌ రాజీనామా చేసి చల్లా బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, పోలీసులు పుంగనూర్ లో ఎలాంటి అల్లర్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎవరన్న గొడవలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ చేయడంతో పాటు ఆయన ఇంటి చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎంపీ ఇంటి సమీపంలో వైపుకు ఎవర్ని కూడా అనుమతించడం లేదు పోలీసులు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. ఇక, స్వామివారిని నిన్న 80, 404 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 35, 825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే, తిరుమల హుండీ ఆదాయం 3. 83 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు కనీస సదుపాయాలను అందిస్తున్నారు.

అమర్‌నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో కట్టుదిట్టమైన భద్రతలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం 13,000 మంది భక్తులు బం బం భోలే నినాదంతో పవిత్ర గుహలో బాబా బర్ఫాని దర్శనం చేసుకున్నారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహ ఆలయానికి ప్రయాణం ప్రారంభించేందుకు బాల్టాల్, నునావన్‌లోని రెండు బేస్ క్యాంపుల నుండి యాత్రికుల మొదటి బ్యాచ్ బయలుదేరింది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, బాబా బర్ఫానీని చూడడం వల్ల శివ భక్తుల్లో అపారమైన శక్తి వస్తుందని అన్నారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ‘యాత్రికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ‘X’ పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. బాబా బర్ఫానీ దర్శనానికి సంబంధించిన ఈ ప్రయాణం శివ భక్తులలో అపారమైన శక్తిని నింపుతుంది. ఆయన అనుగ్రహంతో భక్తులందరూ సుఖశాంతులను పొందాలని నా కోరిక. జై బాబా బర్ఫానీ.’ అంటూ రాసుకొచ్చారు. అమర్‌నాథ్ గుహ ఆలయానికి సురక్షితమైన, సులభమైన, ఆహ్లాదకరమైన తీర్థయాత్ర అనుభూతిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమర్‌నాథ్ యాత్ర భారతీయ సంస్కృతి, సంప్రదాయవాదం కొనసాగింపునకు శాశ్వతమైన చిహ్నం అని అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేశారు. నేటి నుంచి ఈ దివ్య యాత్ర ప్రారంభమైంది. భక్తులందరికీ బాబా దర్శనం, పూజలు జరగాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోడీ నాయకత్వంలో, భక్తులకు సురక్షితమైన, సాఫీగా , ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆత్మాహుతి దాడులతో వణికిపోయిన నైజీరియా.. 19 మంది మృతి, 42 మందికి పైగా గాయాలు
ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోయింది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 19 మంది చనిపోగా, 42 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో జరిగింది. స్థానిక రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ ఈ సమాచారం అందించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా ఏజెన్సీ అనుమానిస్తోంది. రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు మాట్లాడుతూ.. అనుమానిత ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గ్వోజా నగరంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో గర్భిణులు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ.. భద్రతా పోస్ట్‌పై కూడా దాడి జరిగిందని, ఈ దాడిలో అతని ఇద్దరు సహచరులు, ఒక సైనికుడు కూడా మరణించారని చెప్పారు. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. బోర్నో స్టేట్ పోలీసులు కూడా ఈ ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేదు. బోర్నో ఆఫ్ నైజీరియా చాలా ఉగ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్న ప్రాంతం. బోకో హరామ్, దాని విడిపోయిన ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ గ్రూప్ చాలా చురుకుగా ఉన్నాయి. ఈ దాడి బోకోహరమ్‌పైనే జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్‌తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాద పరిధిని విస్తరించింది. బోకోహరాం ఇప్పటి వరకు వేలాది మందిని దారుణంగా హత్య చేసింది.

మీ అద్భుత ఆటతీరుకు గర్వపడుతున్నారు..టీమిండియాపై మోడీ ప్రశంసలు
విదేశీ గడ్డపై భారత జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియాకు అభినందనలు తెలిపే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి సహా పలువురు టీమిండియాకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నామని అన్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. “ఛాంపియన్! మా జట్టు T20 ప్రపంచ కప్‌ను గొప్ప శైలిలో భారత్ కు (ఇంటికి) తీసుకువచ్చింది! మేము భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నాము. ఈ మ్యాచ్ చారిత్రాత్మకమైనది.” అని వ్యాఖ్యానించారు. ఈ విజయం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఓ వీడియోను పోస్ట్ చేసిన మోడీ, “ఈ గొప్ప విజయానికి దేశప్రజలందరి తరపున టీమ్ ఇండియాకు అభినందనలు. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు మీ ఆటతీరుకు గర్వపడుతున్నారు. మీరు ప్లేగ్రౌండ్‌లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు. వీధులు మరియు పరిసరాల్లో భారతదేశం, మీరు దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు.” అని వీడియోలో పేర్కొన్నారు.

నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది.. వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇది: ఎంఎస్ ధోనీ
బార్బడోస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను భారత్ ఒడిసిపట్టింది. ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన టీమిండియాకు రెండో కప్‌ గెలవడానికి 17 ఏళ్లు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవడంతో భారతదేశం మొత్తం ఆనందంలో తెలియాడుతోంది. ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత విజయం అనంతరంటీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ అయింది. టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్ మ్యాచ్‌ సమయంలో తన హార్ట్‌ రేట్‌ పెరిగిపోయిందని, వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. ‘ప్రపంచకప్‌ 2024 ఛాంపియన్స్‌. ఫైనల్ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విశ్వ విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి ఫలితం రాబట్టడం అద్భుతం. ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. వెలకట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ధోనీ అన్నాడు. జులై 7న ధోనీ బర్త్‌డే అన్న విషయం తెలిసిందే.

17ఏళ్ల కల నెరవేరిన వేళ..ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న భారత్ జట్టు..
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్‌ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు పోరాటం చేసివిజయ కిరీటాన్ని సంపాదించడంతో సంబరాలు మొదలయ్యాయి. బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి బంతిని హార్దిక్ పాండ్యా వేయగానే.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ సహా అందరూ ఏడ్చారు. గత 17 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించిన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. తన సారథ్యంలో 17 ఏళ్ల కల నెరవేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. భారత్ జెండాను అక్కడ మైదానంలో పాతాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ట్రోల్‌కు గురైన హార్దిక్‌.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌ శర్మ అభిమానులకు అభివాదం చేసి కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాడు. బార్బడోస్‌లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, రోహిత్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని పాతిపెట్టినప్పుడు. హార్దిక్ భారత జెండాతో పిచ్‌పైకి వచ్చి ముద్దాడాడు.