ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సెక్యూరిటీ తొలగింపు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తరహాలోనే మరో లీడర్‌కి షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు గన్ మెన్ తొలగించింది. ప్రదీప్‌రావుకు 2+2 సెక్యూరిటీ కల్పించింది ప్రభుత్వం.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్లను తొలగించింది. అయితే.. ఏడేళ్లుగా నలుగురు గన్‌మెన్లు ప్రదీప్‌రావుకు భద్రత కల్పిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఆ నలుగురు గన్‌మెన్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే గన్ మెన్ల తొలగింపుపై ప్రదీప్ రావు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరడంతో కక్షసాధింపు ధోరణితో గన్ మెన్ లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు. గత ఏడేళ్ళుగా ఉన్న 2 ప్లస్ 2 గన్ మెన్ లను సడెన్ తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉంటేనే కదా గన్ మెన్ లను కెటాయించిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే.. నా అంతు చూస్తానని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులో గన్ మెన్ లను తొలగించడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. జరగకూడనిది జరిగితే అందుకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు.
2023 క్యాలెండరును ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా ముందుకు సాగుతున్నారు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదంటూ ప్రకృతిలో పరవశిస్తున్నట్లుగా పక్షుల ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రకృతి ఆనందాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను ప్రగతి భవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్ ను అభినందించారు. ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మాస్టర్ ప్లాన్ పై నేడు మరో సారి హైకోర్టులో విచారణ
కామారెడ్డిలో టెన్షన్ మళ్ళీ మొదలైంది. నేడు హై కోర్టులో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై మరో సారి విచారణ జరగనుంది. ప్రభుత్వం కౌంటర్ కు సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపాల్ కమీషనర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ప్రతివాదులుగా అందులో చేర్చారు. న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి రైతుల తరపు వాదనలు వినిపించనున్నారు. హై కోర్టు విచారణపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
Read also: Errabelli Pradeep: మొన్న పొంగులేటి, ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సెక్యూరిటీ తొలగింపు..! నెక్ట్?
నేడు జగనన్న తోడు పథకం ద్వారా డబ్బులు జమ
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో జగనన్న తోడు కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేలు రుణం అందిస్తోంది. అధిక వడ్డీ భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. లబ్ధిదారుల పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రుణాన్ని అందజేస్తోంది. ఈ మేరకు ఈరోజు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. జగనన్న తోడు పథకం ద్వారా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరనుంది.
Read also: Chiru Balayya: ఇంకా ఓపెన్ అవ్వని బుకింగ్స్.. ఆందోళనలో ఫ్యాన్స్
ప్రమాదం అంచున హిమాలయ పట్టణాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ పట్టణంలో దాదాపుగా 700కు పైగా ఇళ్లు, భవనాలు నెలలోకి కూరుకుపోవడంతో పాటు బీటలువారుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చేవేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ అందర్నీ కలవరపెడుతోంది. జోషిమఠ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే పట్టణాలు, గ్రామాలు ప్రతీ సంవత్సరం 2.5 అంగుళాల మేర నెలలోకి కూరుకుపోతున్నట్లు తేలింది. డెహ్రాడూన్ నగరానికి చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్ ఈ ప్రాంతంలోని ఉపగ్రహ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది.
గోటబయ, మహిందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఆంక్షలతో రాజపక్స సోదరులుపై ఆర్థికంగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. కెనడాలోని వ్యక్తులు, కెనడా వెలుపల ఉన్న కెనిడియన్లు ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు పెట్టుకోకుండా నిషేధించింది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వీరిని కెనడాలోకి అనుమతించరు. ఇదిలా ఉంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన గోటబయ రాజపక్స, ప్రజా ఉద్యమం కారణంగా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయాడు. ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స కూడా తన పదవికి రాజీనామా చేశాడు.
Read also: RRR: ఆ అవార్డ్ మిస్ అయిన ఆర్ ఆర్ ఆర్…
‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకున్నాడు. కాగా ఒక ఇండియన్ సినిమాకు తొలిసారిగా ఈ అవార్డు దక్కడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ మూవీలో నాటు నాటు పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
వివాదంలో యూత్ ఫెస్టివల్ సాంగ్
కేరళలో యూత్ ఫెస్టివ్ సాంగ్, డ్యాన్స్ స్కిట్ వివాదాస్పదం అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార లెఫ్ట్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ పాట, డ్యాన్స్ స్కిట్ ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పినరయి విజయన్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇటీవల కోజికోడ్ లో జరిగిన యూత్ ఫెస్టివల్ స్వాగత గీతం, డ్యాన్స్ స్కిట్ లో భాగంగా దేశభక్తి, లౌకికవాదం, ఐక్యత, బలగాల పోరాట స్ఫూర్తిని వర్ణించే విధంగా ఓ సాంగ్ పై ప్రదర్శన ఇచ్చారు. ఇందులో భారత ఆర్మీ జవాన్ ఓ చొరబాటుదారుడిని పట్టుకుంటాడు. అయితే చొరబాటుదారుడు సంప్రదాయ ముస్లిం దుస్తులు ధరించి ఉండటంతో వివాదం రాజుకుంది.
ఇంకా ఓపెన్ అవ్వని బుకింగ్స్.. ఆందోళనలో ఫ్యాన్స్
కోలీవుడ్‌లో పొంగల్‌ను మూడు రోజుల ముందే మొదలుపెడుతూ విజయ్, అజిత్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణాన్ని ముందే తీసుకోని రావాల్సిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు మాత్రం సినీ అభిమానులని కంగారు పెడుతున్నాయి. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని నిజం చేస్తూ తెలంగాణాలో, ఓవర్సీస్ లో రెండు సినిమాల ప్రీబుకింగ్స్ సూపర్బ్ గా జరుగుతున్నాయి. తెలంగాణాలో టికెట్ రేట్స్ విషయంలో, స్పెషల్ షోస్ విషయంలో కూడా పర్మిషన్స్ బయటకి రావడంతో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది.
#GoldenGlobe రిపోర్టర్ బర్త్ డే అని తెలిసి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. ఈ అవార్డ్ ఈవెంట్ ప్రీషోలో యంగ్ నటైగర్ ఎన్టీఆర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ హాలీవుడ్ మార్వెల్ ఆఫర్ గురించి మాట్లాడుతూ… ఛాన్స్ వస్తే చేస్తాను అని చెప్పాడు. రాజమౌళితో ఆల్రెడీ పని చేశాను కాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ముందే తెలుసు కానీ ఇంత దూరం వచ్చి అవార్డ్ గెలుస్తుందని అనుకోలేదని చెప్పాడు. ఇదే సమయంలో రిపోర్టర్ బర్త్ డే అని తెలుసుకున్న ఎన్టీఆర్… ఒక గిఫ్ట్ ఇచ్చి రిపోర్టర్ ‘మార్క్’ అనే అతనికి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ నుంచి గిఫ్ట్ రావడం ఊహించని రిపోర్టర్, ఎన్టీఆర్ ని హగ్ చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అతను తన ట్విట్టర్ లో మార్క్ ఒక వీడియో పోస్ట్ చేసి ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పాడు. ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన మార్క్, అందులో ‘బౌ-టై’ని చూసి ఎన్టీఆర్ ది బెస్ట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ అభిమానులు అంతా మార్క్ చేసిన ట్వీట్ కింద ‘హ్యాపీ బర్త్ డే మార్క్ మావా బ్రో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Errabelli Pradeep: మొన్న పొంగులేటి, ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సెక్యూరిటీ తొలగింపు..! నెక్ట్?