NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఇందులో మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి పథకాలకు ఆమోదం చెప్పడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా, ఈ కేబినెట్ సమావేశంలోనే ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీతో పాటు పీ-4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చెత్తపై విధించిన పన్నును రద్దు చేసే అంశంపై కూడా ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనుంది. అలాగే, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటుగా అమరావతి రాజధాని పున: నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది మార్చి నాటికి బందరు పోర్టును ప్రారంభిస్తాం..
బందరు పోర్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతికి దగ్గరగా బందరు పోర్టు ఉంటుంది.. బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది.. ఇసుక కొరత ఉందని‌ చెప్పారు.. ఫాస్ట్ ట్రాక్ లో ఇవ్వాలని చెప్పాం.. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయి.. అనేక అవకాశాలు పరిశీలించి వాటిని ప్రోత్సహిస్తాం.. మంచి పోర్టుగా అభివృద్ధి చేసి చూపుతామని సీఎం చెప్పారు. అలాగే, మచిలీపట్నం అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. గతంలో నేనే ఈ ప్రాజెక్టును ప్రారంభించా.. మళ్లీ వాళ్లు మొదలు పెట్టి పనులు ఆపేశారు.. ఈసారి బందరు పోర్ట్ పూర్తి చేసి చూపుతాం.. ఎంతో మంది ఈ‌ బందరు పోర్టు కోసం పెద్ద ఉద్యమాలు చేశారు.. నాలుగు బెర్తులు ఉన్నాయి.. పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదు అని చంద్రబాబు అన్నారు. అలాగే, అవసరమైతే భూసమీకరణ మళ్లీ చేపడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..
తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. స్కూల్స్‌ పోయాయి, చదువులు పోయాయి, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, డోర్‌ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా, వ్యవసాయం ఇలా మొత్తం పోయాయని పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇక, రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.. లా అండ్‌ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదు.. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు.. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.. ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేకపోయారు.. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమకు నచ్చినవారికి మాత్రమే వరద సాయం ఇస్తున్నారు.. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది.. అందుకనే ప్రజలను డైవర్ట్‌ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదకి తెస్తున్నారు.. ఆ కొత్త టాపిక్స్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వీళ్ల చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హిరోహిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అన్నారు. ఎంతో మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆదుకున్నాడు అని తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ అలవాటు చేశాడని మండిపడ్డారు. దసరా పండుగ ముందు.. అడ బిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు.

కొండా సురేఖ.. దొంగ ఏడుపులు..పెడబొబ్బలు దేనికి?.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..
కొండా సురేఖ.. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అని మండిపడ్డారు. గతంలో కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే అని తెలిపారు. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? అన్నారు. మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా అని మండిపడ్డారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలన్నారు. మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలువదని కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? కొండా సురేఖపై ప్రకాశ్ రాజ్ ఫైర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. “ఎక్స్”లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నారు. “ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా ?..” అని రాసుకొచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హిరోహిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

జార్ఖండ్‌లో దుండగుల దుశ్చర్య.. రైల్వే ట్రాక్ పేల్చివేత
జార్ఖండ్‌లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. దీంతో 39 మీటర్ల మేర రైల్వేట్రాక్ ఎగిరిపడ్డాది. ఇక పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ కింద మూడు అడుగుల గొయ్యిలు ఏర్పడ్డాయి. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్ట గ్రామం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే రైల్వేట్రాక్‌లే లక్ష్యంగా కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య యూపీలో కూడా రైల్వేట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప రాడ్లు పెట్టి ప్రమాదాలు సృష్టించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే రైల్వే అధికారుల అప్రమత్తతతో ప్రమాదాలు తప్పాయి. అయినా కూడా ఇలాంటి దుశ్చర్యలు ఆగడం లేదు. జార్ఖండ్‌లో బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చివేశారు. దీని వెనక క్రిమినల్‌ ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనాస్థలిని పరిశీలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఐఏఎఫ్ ఛాపర్‌లో సాంకేతిక లోపం.. వరద నీటిలో ల్యాండింగ్
బీహార్ వరదల్లో బాధితులకు సాయం చేస్తున్న ఐఏఎఫ్ ఛాపర్‌‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంగా వరద నీటిలో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. స్థానికులు పడవ సాయంతో దగ్గరకు వెళ్లి రక్షించారు. ఇద్దరు అధికారులతో సహా నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా బీహార్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు. దీంతో హెలికాప్టర్ సాయంతో బాధితులకు ఆహారం, నీళ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అయితే బుధవారం భారత వైమానికి దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా రిలీఫ్ మెటీరియల్‌ను అందిస్తుండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం బలవంతంగా పైలట్ ల్యాండింగ్ చేశారు. దర్భంగా ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌.. ముజఫర్‌పూర్‌లోని నయా గావ్‌లో ల్యాండింగ్‌ చేసింది. ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్‌లోని కొంత భాగం వరద నీటిలో మునిగిపోయింది. పైలట్ తెలివిగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ తెలిపారు. ఇంజిన్ విఫలమైనప్పుడు చుట్టుపక్కల ప్రజలు లోతులేని నీటిలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా పైలట్‌కు సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని, ప్రమాదం జరిగిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహాయక చర్యలు ప్రారంభించిందని అమృత్ తెలిపారు. తొలుత ఆ ప్రాంత వాసులు సహాయక చర్యలు చేపట్టారని వివరించారు.

ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్‌ మీడియాలో కథనాలు
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది. మొత్తానికి ఇరాన్ యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇరాన్‌ను ముందుగానే అమెరికా హెచ్చరించింది. దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయినా కూడా అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌పై క్షిపణుల దాడికి దిగింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సాయంతో గగనతంలోనే ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని మాత్రం టెల్‌అవీవ్ ప్రాంతంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగబోతుందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగబోతున్నట్లుగా అమెరికా మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కూడా ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలతను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరైన సుమలత.. మహిళా కోరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలు ఖండించింది. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించింది. తన భర్త జానీపై లేని పోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు. మరో వైపు రేపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించనుంది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్‌ భార్య అయేషా అలియాస్ సుమలత ఇటీవల అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. జానీ మాస్టర్‌ నిజం ఒప్పుకున్నారని మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపడేశారు.

రేసులో రోహిత్, సిరాజ్, జైస్వాల్.. ఇద్దరిని వరించిన అవార్డు!
ప్రతీ టెస్టు సిరీస్‌ తర్వాత ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్‌ గంభీర్‌ కోచ్‌గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ అనంతరం ఫీల్డింగ్‌లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్‌ పట్టిన మహ్మద్ సిరాజ్‌తో పాటు సిరీస్‌ ఆసాంతం అద్భుత ఫీల్డింగ్‌ చేసిన యశస్వి జైస్వాల్‌కు అవార్డు దక్కింది. భారత జట్టులోని ప్రతి ఒక్కరూ మైదానంలో చురుగ్గా వ్యవహరించారని ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్ అభినందించాడు. ‘మ్యాచులో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. చాలా అవకాశాలను బాగా ఒడిసిపట్టారు. చెన్నై వంటి ఉక్కపోతగా ఉండే వాతావరణంలోనూ అందరూ అద్భుతంగా ఫీల్డింగ్‌ చేశారు. కాన్పూర్‌లో వర్షం కారణంగా మైదానం చాలా తేమగా ఉన్నా.. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ప్రతిఒక్కరూ మైదానంలో చురుగ్గా కదిలారు. ఇంపాక్ట్‌ ఫీల్డర్ అవార్డు రేసులో యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్‌, రోహిత్ శర్మ నిలిచారు. ఫీల్డింగ్‌లోనూ రోహిత్ నమ్మదగ్గ క్రికెటర్. యశస్వి, సిరాజ్‌ అద్భుతంగా క్యాచ్‌లు అందుకున్నారు. ఈసారి జైస్వాల్‌, సిరాజ్‌కు అవార్డును అందిస్తున్నాము’ అని దిలీప్ చెప్పాడు.