NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? బాలయ్య సినిమాలు చూసి పిచ్చెక్కిందా..?
గన్నవరం పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. మాటల తూటాలు, దాడులు, కేసుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, ఇవాళ గన్నవరంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికార వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, పోలీసులపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? లేక బాలకృష్ణ పిచ్చి సినిమాలు చూసి పిచ్చెక్కిందా? అంటూ ఎద్దేవా చేశారు.. గన్నవరానికి పిచ్చోడు వచ్చాడని ప్రజలు చెబుతున్నారన్న ఆయన.. నేను, వల్లభనేని వంశీ వస్తాం.. నువ్వు రెడీ నా బాబు? అంటూ సవాల్‌ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? ఎక్కడ కొట్టుకుందాం? చెప్పు.. పైకి పోదామా? జైల్ కు పోదామా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను, వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీ నా బాబు?
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గన్నవరంలో చంద్రబాబు పర్యటన, అక్కడ బాబు చేసిన కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు కొడాలి నాని.. నేను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీనా బాబు? అని సవాల్‌ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. చత్తీస్‌గఢ్‌, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? ఎక్కడ కొట్టుకుందాం? చెప్పు.. కొట్టుకొని పైకి పోదామా? జైల్ కు పోదామా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. ఇక, వంశీ పశువుల డాక్టర్ కోర్సు చదివాడు.. పశువుల డాక్టర్ నోరు లేని ప్రాణాలకు జీవం పోస్తాడు.. కానీ, చంద్రబాబు ఆ పశువుల పాలు, పెరుగు అమ్ముకుంటాడు.. పశువుల డాక్టర్ బెటరా? పాలు అమ్ముకునే 420 బెటరా? అంటూ ప్రశ్నించారు.. గన్నవరానికి పట్టాభిని పంపింది చంద్రబాబేనని విమర్శించారు కొడాలి నాని.

ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు
వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై బీజేపీ వాళ్లు అనవసరమైన తగాదాలు సృష్టిస్తున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రీతిని సైఫ్ వేధించాడని విచారణలో తేలిందని.. వేధింపుల కారణంగానే ఆ అమ్మాయి ఇలంటి నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఆ యువతికి వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఆ అమ్మాయికి ఇదివరకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. సైఫ్‌కి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సైఫ్ వేధింపుల వల్లే ఇలా జరిగిందని, దీనిని రాజకీయం చేయొద్దని, కావాలని రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రీతి కుటుంబ సభ్యులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రీతి తనకు బిడ్డ లాంటిదని మంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా.. ప్రీతిని సైఫ్ కావాలనే వేధించినట్టు వాట్సప్ చాట్స్ ద్వారా తేలిందని సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి మానసికంగా ఇబ్బందులు పడిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్పష్టం చేశారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడడానికి ముందు ప్రీతి గూగుల్‌లో సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తేలిందన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీశామని, టాక్సికాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపిన ఆయన.. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగు పులమొద్దని కోరారు. సైఫ్‌కు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదన్నారు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. వాట్సప్ గ్రూపుల్లో సైఫ్ ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేశాని, బుర్ర తక్కువ ఉందని ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు. ప్రీతి ప్రశ్నించే తత్వాన్ని సహించలేక.. సైఫ్ వేధించినట్లు తేలిందన్నారు.

వైఎస్సార్, సోనియా నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేఏ పాల్ సంచలనం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ గతంలో తనను చంపేందుకు ప్రయత్నించారని బాంబ్ పేల్చారు. అయితే.. తనని నాశనం చేద్దామని చూసిన వారు ఇప్పుడు ఎవరూ లేరన్నారు. తాను ప్రజల కోసం దేవుని చేత పంపబడిన దూతని అని పేర్కొన్నారు. దేశం నాశనం కాకూడదని తాను పోరాడుతున్నానన్నారు. తాను అమరావతిని, దేశాన్ని అభివృద్ధి చేయగలనని.. దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్నానని అన్నారు. తనను డబ్బులతో ఎవరూ కొనలేరన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసున్నారు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2010లో తన సోదరుడి హత్య జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. జగన్, బాలినేని శ్రీనివాస్ కాలంలో రాజకీయంగా వచ్చానని తనని అరెస్ట్ చేశారని ఆరోపణలు చేశారు. తన సోదరుడి హత్యకు తానే రూ.1 కోటి ఇచ్చానంటూ తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ తర్వాత అది తప్పుడు కేసు అని నిరూపితమైందని చెప్పారు. ఇప్పుడు తనపై తప్పుడు కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. తనని తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసుల్ని తిరగదోడుతున్నారన్నారు. తాను కామారెడ్డి రైతులకు న్యాయం చేశానని, దాంతో కేసీఆర్ భయపడి తనని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి, పాత కేసులో తనని అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. డిసెంబర్ కల్లా కెసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేస్తారని జోస్యం చెప్పారు. కనీసం కుక్కల నుంచి ప్రజలను కాపాడలేక పోతున్నారన్నారు. కేవలం కామారెడ్డి కాదు, తెలంగాణ రైతుల పక్షాన తాను నిలబడతానని హామీ ఇచ్చారు. తాను ఐదు లక్షల కోట్లు దానం చేశానన్నారు.

షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భద్రత కట్టుదిట్టం
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిల్లాంగ్‌లో రోడ్‌షో నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమైన రోడ్‌షో పోలీసు బజార్‌లో ముగిసింది. అక్కడ బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి వాహనం వెళ్లే రహదారికి ఇరువైపులా ప్రజలు క్యూలు కట్టడంతో రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. ప్రధాని కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వారి వైపు చేతులు ఊపుతూ కనిపించారు. షిల్లాంగ్‌లో రాష్ట్రంలోని ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు యు తిరోట్ సింగ్, యు కియాంగ్ నంగ్‌బా, ప టోగన్ సంగ్మా చిత్రపటాలకు కూడా ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు షిల్లాంగ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షిల్లాంగ్‌లోని రోడ్‌షో నేపథ్యంలో పోలీస్ బజార్ పాయింట్‌లో మేఘాలయ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా 1,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. షిల్లాంగ్‌లో ప్రధానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని.. నగరంలో 1000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు షిల్లాంగ్‌లోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పవార్ స్వప్నిల్ వసంతరావు తెలిపారు. అనంతరం శుక్రవారం గారో హిల్స్‌లోని తురాలోని అలోత్గ్రే స్టేడియంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

గుజరాత్ బడ్జెట్ రూ.3.01 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా రెట్టింపు
గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. గుజరాత్ ఆర్థిక శాఖ రాష్ట్రానికి సంబంధించి రూ.3.01 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది. ఇది గత ఏడాది కంటే 23.38 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్‌లో పౌరులపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య-ఎంఏ (పీఎంజేవై-ఎంఎ) పథకం కింద బీమా కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు రెట్టింపు చేసి, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రకటించింది.

ఆధార్‌ జిరాక్స్‌లు ఎక్కడా ఇవ్వొద్దు..! క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ
అన్నింటికీ ఆధారే ఆదారం.. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే సంబంధం లేకుండా ఏ కార్యాలయానికి.. ఏ పని మీద వెళ్లినా.. ఆధార్‌ కార్డు అడుగుతున్నారు.. అయితే, ఆధార్‌ కార్డుపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.. ఆధార్‌ కార్డును మిస్‌ యూజ్‌ చేసే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.. ఇక, ఈ మధ్య ఓ వార్త వైరల్‌గా మారిపోయింది.. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, ప్రభుత్వ పథకం కోసం అయినా సరే తమ ఆధార్‌ కార్డుకు సంబంధించిన జిరాక్స్‌లు సైతం ఇవ్వకూడదు.. అనేది దాని సారాశం.. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ హల్‌చల్‌ చేస్తోంది.. దీంతో, దీనిపై క్లారిటీ ఇచ్చింది యూఐడీఏఐ.. వైరల్‌గా మారిన ఆ మెసేజ్‌ ఫేక్‌గా నిర్ధారించింది యూఐడీఏఐ.. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని, అందులో ఇచ్చిన యూఐడీఏఐ లింక్ కూడా తప్పు అని స్పష్టం చేసింది.. ఆధార్ గురించి విశ్వసనీయ సమాచారాన్ని పొందడానికి, వినియోగదారులు ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.. uidai.gov.in అని పేర్కొంది.. యూఐడీఏఐ నిరంతరం తమ ఆధార్ వివరాలను భద్రపరచాలని మరియు అనధికార సంస్థలతో వాటిని పంచుకోవద్దని ప్రజలను కోరుతుంది. వారు వ్యక్తిగత సమాచారాన్ని ఎలా భద్రపరచాలి మరియు మోసాన్ని నిరోధించడం గురించి మార్గదర్శకాలను కూడా అందిస్తూనే ఉన్నాం.. యూఐడీఏఐ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే సందేశాలు లేదా ఈమెయిల్‌ల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.. వాటిపై చర్య తీసుకునే ముందు అటువంటి సందేశాల యొక్క ప్రామాణికతను ధృవీకరించాలని సూచించింది.

పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మొదటి నుంచి త్రివిక్రమ్ రీపీట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూజానే. అరవింద సమేత, అల వైకుంఠపురంలో, ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ నెక్స్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిల్మ్ లో కూడా పూజానే హీరోయిన్ అని టాక్. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అందులో నిజం ఎంత అనేది తెలియదు.. వారిద్దరూ కూడా ఈ వార్తలపై స్పందించిందీ లేదు. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్.. పూజా హెగ్డేకు రెండు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ కారులోనే పూజా షూటింగ్స్ కు రానున్నదట. అయితే అసలు నిజం ఏంటి అంటే.. త్రివిక్రమ్ తన ప్రొడక్షన్ తరుపున ఒక ఇన్నోవా కారును కొనుగోలు చేశాడట. ప్రతిసారి హీరోయిన్లు సెట్ కు రావాలంటే అద్దెకార్లకు డబ్బులు పెట్టాలి. అలా కాకుండా ప్రొడక్షన్ కు ఒక కారు ఉంటే ఆ ఖర్చులు కలిసివస్తాయి అన్న ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ కారు కొన్నాడట. ఇది కేవలం హీరోయిన్స్ కు మాత్రమే అని సమాచారం. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే.. ఈ కారు కొన్న మొదటిసారి అందులో ఎక్కే మొదటి హీరోయిన్ పూజానే కావడంతో అభిమానులు వీరిద్దరిపై మరోసారి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా అవ్వగానే ఆ ప్రొడక్షన్ లో నటించే ఏ హీరోయిన్ అయినా ఆమెకు కూడా ఈ కారు కొన్నిరోజులు సొంతం అయ్యినట్లే లెక్క.. మరి ఈ కారులో పూజా పాప ఏ రేంజ్ లో సెట్ కు వెళ్తుందో చూడాలి.

ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. ఇక కోలీవుడ్ రొమాంటిక్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శింబు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తల గుప్పుమన్నాయి. ఎప్పటినుంచో శింబు పెళ్లి వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తూనే వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం నిజమే అని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాలంగా శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. వీరిద్దరూ కూడా ఈ పుకార్లను ఖండించకపోయేసరికి నిజమే అనుకున్నారు కూడా.. కాగా శింబు నిధిని పెళ్లి చేసుకోవడం అనేది రూమర్ అంట.. శ్రీలంకన్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కూతురుతో శింబు వివాహం జరగనుందట. సీక్రెట్ గా వీరి పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని టాక్. వీరి పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే కోలీవుడ్ లో ఎక్కువమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్న ఏకైక హీరో ఎవరు అంటే శింబు అని టక్కున చెప్పేస్తారు. మొదట్లో నయనతారతో శింబు నడిపిన ప్రేమాయణం దేశం మొత్తం తెలుసు. వీరిద్దరి ప్రైవేట్ ఫొటోస్ కూడా అలెక్ అయ్యాయి. ఇక కొన్నేళ్లు బాగానే ఉన్నా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ జంట విడిపోయారు. శింబు నుంచి విడిపోయాక నయన్.. ప్రభుదేవా ప్రేమలో పడడం, పెళ్లి వరకు వెళ్లడం.. అదికాస్తా బెడిసికొట్టడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక దానితరువాత నయన్ లైఫ్ లోకి డైరెక్టర్ విగ్నేష్ శివన్ అడుగుపెట్టాడు. దాదాపు ఐదేళ్లు వీరు ప్రేమలో ఉండి.. గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు.