పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశాం..
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వడం లేదు అని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు 1191 కేసులు వేశారు.. చంద్రబాబు సృష్టించిన న్యాయపరమైన అడ్డంకులన్నింటిన్నీ దాటుకుని వచ్చామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం.. పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం.. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశాం.. ఇంటింటికీ తలుపు తట్టి ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం.. అందరికీ ఒకటే రూల్స్ ఉండాలని నిబంధనలు మార్చాం అని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలి అని సీఎం జగన్ తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయం ఉండకూడదని రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇస్తున్నాం.. రాష్ట్ర ప్రజలకు రెండు రకాల పద్ధతులు మొదట్లో ఆశ్చర్యం కలిగించింది.
ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా..
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు సీఎం జగన్ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పా.. సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాను అని ఆయన పేర్కొన్నారు. సీఎం వల్లే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సాకారమైంది.. గతంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం యర్రజర్లలో చూసిన ప్రభుత్వ భూమికి టీడీపీ అడ్డంకులు సృష్టించింది.. అందుకే అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశాం.. ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు. భూములకు నాకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.. ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు..
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన PAC ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నారు. జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృదా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృదా చేస్తున్నారు అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ అని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి నిర్వహించుకుంటున్న సభా వేదికపై అన్ని నియోజక వర్గాలకు చెందిన 500 మంది అతిథులు పాల్గొంటున్నారు.. తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ- జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. తొలిసారి జరగబోతున్న సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరు అవుతారు అని నాదేండ్ల మనోహర్ చెప్పారు.
రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించింది మోడీనే..
రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగజ్ నగర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టిందన్నారు. దేశంలోని ప్రజలందరూ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని భద్రత ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అది నరేంద్ర మోడీ వల్లే సాధ్యమవుతుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా మళ్లీ మూడే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాలపాటు నరేంద్ర మోడీ గారు నాలుగు అంశాలపై దృష్టి సాధించారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు గాని, సంక్షేమ కార్యక్రమాన్ని కానీ, మౌలిక అంశాలు, వ్యవసాయం కాకుండా మరో నాలుగు అంశాలపై మోడీ ద్రుష్టి సాధించారని అన్నారు. ఆదివాసీ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకానికి మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా అలాంటి కొన్ని ప్రాంతాలను గుర్తించాము వాటిలో కొన్ని ఆదిలాబాద్ లో కూడా ఉన్నాయి వాటి అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.
మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగింది..!
మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్ లు సైతం అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మన్ సంచలన వాఖ్యాలు చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం దిగ్భ్రాంతి కి గురి చేసిందన్నారు. కుటుంబానికి సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తున్ననని తెలిపారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు దిగ్విజయంగా జరుగుతున్నాయి… ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ రోజు వరకు 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పూర్తి అయిందన్నారు. దేశం కోసం మోడీ… మోడీ కోసం మేము అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దివ్యమైన రామాలయం కట్టిన మోడీ నీ మేము ఎలా కాదంటాము అని అంటున్నారని అన్నారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట ను కాంగ్రెస్ బహిష్కరించడం ను మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్ లు సైతం అంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందన్నారు. యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఫిబ్రవరి 27 నుంచి తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లో మోడీ పర్యటన
లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాలకు కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ప్రధాని గురువారం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరి 27 న ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు బయలుదేరుతారు. రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ ఏమిటో తెలుసుకుందాం. లోక్‌సభ 2024 కోసం ప్రధాని మోడీ రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉంది. పార్టీ పూర్తి స్వింగ్‌లో సన్నాహాలు ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అభివృద్ధి రేటును వేగవంతం చేసేందుకు రాష్ట్రానికి ఎన్నో పెద్ద బహుమతులు ఇవ్వగలడు. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రధాని మోడీ తన మెగా ర్యాలీని ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 గంటలకు ఆయన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి అభివృద్ధి ప్రణాళికలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 27న ఇక్కడ జరిగే ‘ఎన్‌మనేన్ మక్కల్’ (నా భూమి, నా ప్రజలు) పాదయాత్ర చివరి రోజులో ప్రధాని పాల్గొంటారని, ఫిబ్రవరి 28న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ తన ఆవేశపూరిత ర్యాలీలో ప్రసంగించనున్నారు.
దేశంలో నిలిచిపోనున్న 2జీ సేవలు ?
ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల 4జీ, 5జీ సేవలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల మూసివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతకాలం క్రితం బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఈ సేవలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. టెలికాం కస్టమర్లందరినీ 4G, 5G నెట్‌వర్క్‌కి మార్చాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) పట్ల ప్రభుత్వ వైఖరిపై ఒక అప్ డేట్ వచ్చింది. ప్రభుత్వం ఈ విషయాన్ని స్వయంగా నిర్ణయించకూడదని స్పష్టం చేస్తుంది. దేశంలో 2G నెట్‌వర్క్‌ను మూసివేసే విషయంలో టెలికాం డిపార్ట్‌మెంట్ జోక్యం చేసుకోకూడదని.. రిలయన్స్ జియో ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఇది టెలికాం ఆపరేటర్లు తీసుకోవలసిన వాణిజ్య నిర్ణయమని డీవోటీ చెప్పింది. “ప్రభుత్వం అటువంటి విషయాలలో జోక్యం చేసుకోవాలనుకోదు. టెలికాం కంపెనీలు తమకు ఏది మంచిదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది” అని టెలికాం డిపార్ట్‌మెంట్ అధికారి అజ్ఞాత పరిస్థితిపై మీడియాకి తెలిపారు. భారతదేశంలో 6G నెట్‌వర్క్‌కు గత సంవత్సరం నుండి సన్నాహాలు ప్రారంభించబడ్డాయి. 2G-3G సాంకేతికతను కొనసాగించడం ఎంతవరకు లాజికల్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దేశంలో 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను వినియోగించే జనాభా అత్యధికంగా ఉందన్నది నిజం. దేశంలో 1992లో 2జీ నెట్‌వర్క్ వచ్చి 32 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశంలో దాదాపు 25-30 కోట్ల మంది 2G కస్టమర్లు ఉన్నారు.
పరారీలో ఉన్న టీఎంసీ నేత షేక్ షాజహాన్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈడీ దాడులు
ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం రాష్ట్రంలోని దాదాపు ఆరు చోట్ల దాడులు చేసింది. సెంట్రల్ హౌరాలోని షేక్ షాజహాన్ సన్నిహితుడు పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా ఆవరణలో ఈ దాడి జరిగింది. ఈ మేరకు ఈడీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 29న విచారణలో పాల్గొనాల్సిందిగా షాజహాన్‌కు ఈడీ తాజాగా సమన్లు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. షాజహాన్ షేక్, అతని సహచరుల మోసపూరిత భూకబ్జాకు సంబంధించిన పాత కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు ఒక అధికారి చెప్పారు. ఈ వ్యక్తులు షాజహాన్‌తో చేపల వ్యాపారంలో సంబంధం కలిగి ఉన్నారు. ఏజెన్సీ కొన్ని నిర్దిష్ట పత్రాల కోసం వెతుకుతోంది. కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో మొత్తం ఆరు చోట్ల ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పార్థ్ ప్రతిమ్ సేన్‌గుప్తా ఇటీవలే రెండు కొత్త ఇళ్లను కొనుగోలు చేసినట్లు ఈడీ తెలిసింది. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఏజెన్సీ పత్రాలను పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయ్‌గఢ్‌లోని పుకూర్ నంబర్ 10 ప్రాంతంలోని మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరూప్ సోమ్ చాలా కాలంగా చేపల వ్యాపారం చేస్తున్నారు.
నిప్పులు చెరిగిన ఆకాశ్ దీప్.. ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!
ఇంగ్లండ్‌తో రాంచీలో ఆరంభమైన నాలుగో టెస్టులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (11), ఒలీ పోప్ (0), జాక్ క్రాలే (42) ఔట్ చేశాడు. ఆకాశ్ దెబ్బకు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్స్ కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజ్‌లో బెన్ ఫోక్స్ (2), జో రూట్ (16 ) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆరంభించగా.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశ్ దీప్‌కు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆకాశ్.. రెండో ఓవర్లో జాక్ క్రాలే క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అది నోబాల్‌గా తేలడంతో.. ఆకాశ్‌కు నిరాశ తప్పలేదు. ఓవైపు సిరాజ్ భారీగా పరుగులు ఇస్తున్నా.. ఆకాశ్ తన పేస్ పవర్ ఏంటో ఇంగ్లండ్ బ్యాటర్లకు రుచిచూపించాడు.
డిఫ్రెంట్ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!
తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై ‘తంత్ర’ టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెలిపాడు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని ‘తంత్ర ‘తో సాధించాడు.ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య ప్రకటించారు.
