NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎంకు సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి, అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరాం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక, గిరిజన తెనేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా ఉంటుందని గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతియైన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాం..
నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉంది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. దేశంలో 3కోట్ల 40 లక్షల మంది మూత్ర పిండ వ్యాధి తో బాధ పడుతున్నారు అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. కాగా, దాతలు ముందుకు వచ్చి మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనందంగా ఉంది అని మంత్రి సత్య కుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసింది.. సెక్యూరిటీ, శానిటైజేషన్ లో అవకతవకలకు పాల్పడ్డారు.. నాసిరకం మద్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యారు.. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు.

నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు
కులం పేరుతో..మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ…ఇందిరమ్మ ల చరిత్ర వక్రీకరించి పనిలో కొందరు ఉన్నారని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకుల…ఇవ్వాల దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. కులం పేరుతో.. మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారన్నారు. బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే… ఈనాటి పాలకులు కులం..మతం..వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. అందుకే జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ అని తెలిపారు. గాంధీ కలలు కన్న రాజ్యం కోసం రాహుల్ గాంధీ.. అహింసా మార్గంలో పయనిస్తున్నారన్నారు. ఆస్తులు ప్రజల కోసం ధారాదత్తం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబం ది అన్నారు. అలాంటి గాంధీ కుటుంబం పై కుట్రలు చేస్తుంది మోడీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ చిత్రపటం.. కరెన్సీ నోటు మీద లేకుండా చేసే కుట్ర కూడా చేసింది బీజేపీ అని ఆరోపించారు. మోడీ పాలన అంతమొందించడానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబం రాజకీయంగా లేకుండా చేయాలని చూశారు.. కానీ ప్రజలు ప్రతిపక్ష నాయకుడి గా కూర్చోబెట్టారన్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోపెట్టి న ప్రజలు.. వచ్చే ఎన్నికలలో ప్రధాని గా కుర్చోపెట్టబోతున్నారని అన్నారు.

కుక్కల దాడిలో మా బాబు చనిపోయాడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోదా..?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో కీయన్స్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కలు కీయన్స్ పై దాడి చేసి చెంపకు బలంగా కరవరడంతో తీవ్ర గాయాలుతో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ కుదరక పోవడంతో తరువాత కామినేని, నీలపురి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ.. బాలుడు గత 20 రోజులుగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుక్కలను గ్రామం నుండి తీసివేయాలంటూ, ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ బాలుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీం పట్నం రాయపోల్ గ్రామంలో కుక్క కాటుకు గురై చనిపోయిన ఘటన ఇది రెండవది అని మృతుడి కియన్స్ బాలుడి కుటుంబ సభ్యులు వాపోయారు . ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించ లేదని వాపోయారు. ఇప్పుడు మా బాబు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలోనీ పుడమి స్కూల్ లో బాలుడిని విపరీతంగా కరిచిందని.. కుక్క దాడి లో తీవ్ర గాయాలతో కీయన్స్ కు నీలోఫర్ లో ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు.. పిల్లలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కల దాడి నుండి తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామంలో ఇది తీరని లోటని వాపోయారు. మా గ్రామంలో కుక్కల.. అలాగే కోతులు చాలా సంచరిస్తున్నాయి, వాటిని పట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాలు..తప్పిన ప్రమాదం!
దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది. అతడి నుంచి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజ్వాన్‌ను ఢిల్లీలోనే అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాది రిజ్వాన్ అలీ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో నివాసి. పుణె మాడ్యూల్‌కు ప్రధాన నిర్వాహకుడు. గతేడాది జూలై 2023లో పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో సహా దేశంలోని అన్ని ఏజెన్సీలు చాలా కాలంగా నిందితుడి కోసం వెతకడంలో నిమగ్నమయ్యాయి. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేరిన ఈ ఉగ్రవాదికి రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఆగస్టు 15లోపు రిజ్వాన్ అలీని అరెస్టు చేయడం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కి భారీ విజయంగా మారింది. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ సహా అన్ని ఏజెన్సీలు ఇప్పుడు అతనిని విచారిస్తున్నాయి. అతని తదుపరి ప్రణాళిక గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాత్రి 11 గంటలకు అరెస్టు చేయగా ఆయుధాలు.. రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ గురించి ఆగస్టు 8, గురువారం ఎన్ఐఏకి రహస్య సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ లో అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో, వాడి వద్ద 3 లైవ్ కాట్రిడ్జ్‌లతో కూడిన ఒక 30 బోర్ స్టార్ పిస్టల్, రెండు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పేరుమోసిన ఉగ్రవాది రిజ్వాన్‌పై ఇప్పటికే ఢిల్లీ-ముంబైలో తీవ్రమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో ఐసిస్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అరెస్ట్
దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది. అతడి నుంచి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజ్వాన్‌ను ఢిల్లీలోనే అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాది రిజ్వాన్ అలీ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో నివాసి, పుణె మాడ్యూల్‌కు ప్రధాన నిర్వాహకుడు. గత ఏడాది జూలై 2023లో పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో సహా దేశంలోని అన్ని ఏజెన్సీలు చాలా కాలంగా దాని కోసం వెతకడంలో నిమగ్నమయ్యాయి. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేరిన ఈ ఉగ్రవాది పై రూ.3 లక్షల రివార్డు ప్రకటించారు. ఆగస్టు 15లోపు రిజ్వాన్ అలీని అరెస్టు చేయడం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కి భారీ విజయమని చెప్పుకోవచ్చు. ఢిల్లీ పోలీసులు, NIA సహా అన్ని ఏజెన్సీలు ఇప్పుడు అతనిని విచారిస్తున్నాయి. అతని తదుపరి ప్రణాళిక గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాత్రి 11 గంటలకు అరెస్టు చేయగా ఆయుధాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ గురించి ఆగస్టు 8, గురువారం NIAకి రహస్య సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీని తరువాత, ఢిల్లీ పోలీసులు అతన్ని రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ నుండి అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అతని వద్ద నుండి 3 లైవ్ కాట్రిడ్జ్‌లతో కూడిన ఒక 30 బోర్ స్టార్ పిస్టల్.. రెండు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పేరుమోసిన ఉగ్రవాది రిజ్వాన్‌పై ఢిల్లీ-ముంబైలో తీవ్రమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతని కేసులన్నీ ఎన్ఐఏ దర్యాప్తులో ఉన్నాయి.

ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. 232 మంది మృతి
రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్‌లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు. జూలై మధ్యలో ప్రారంభమైన రిజర్వేషన్‌ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. బంగ్లాదేశ్‌లోని ప్రోథోమ్ అలో వార్తాపత్రిక ప్రకారం.. బుధవారం ఒక్కరోజే హింసలో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు. బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు జూన్ నెల నుండి ఆందోళన చేస్తున్నారు. అనేక వారాల పాటు కొనసాగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రభుత్వ పతనం తరువాత, నిరసనలు హింసాత్మకంగా మారాయి, ఇందులో 232 మంది మరణించారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన నిరసనల్లో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 16 – ఆగస్టు 4 మధ్య రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణలలో 328 మంది మరణించారు. ఈ రెండు పరిణామాల మధ్య గత 23 రోజుల్లో మొత్తం 560 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది మంగళవారం మరణించారు.

హాకీ కిట్ కొనడానికి ఆవును అమ్మిన శ్రీజేశ్‌ తండ్రి.. ఆ రోజు ఏం చెప్పాడంటే?
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరోసారి అద్భుతం చేసింది. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. స్పెయిన్‌పై గెలిచి పతకం గెలవడమే కాదు.. భారత హాకీకి పెట్టని కోట గోడగా పేరొందిన పరట్టు రవీంద్రన్‌ శ్రీజేశ్‌ (పీఆర్‌ శ్రీజేశ్‌)కు ఘనమైన వీడ్కోలు పలికారు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడేసిన గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ది భారత విజయాల్లో కీలకపాత్ర. అయితే శ్రీజేష్ కోసం అతని తండ్రి పీవీ రవీంద్రన్ చాలా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో కొడుక్కి హాకీ కిట్ కొనిపెట్టడానికి ఏకంగా వారి ఇంట్లో ఆవును కూడా అమ్మేశారు. 1998లో 12 ఏళ్ల వయసులో హాకీ నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌లో పీఆర్‌ శ్రీజేశ్‌ చేరారు. ఆ స్కూల్‌ హాకీ కోచ్‌.. శ్రీజేష్‌ను గోల్‌ కీపింగ్‌ నేర్చుకొమ్మని సలహా ఇచ్చారు. కోచ్‌ చెప్పిన విషయాన్ని శ్రీజేష్‌ తన తండ్రికి చెప్పారు. కొడుకు కలను సాకారం చేసేందుకు పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేశారు. కిట్ ఖరీదు ఖరీదు 10 వేలు కాగా.. తన వద్ద 3 వేలు మాత్రమే ఉండడంతో రవీంద్రన్ ఆవును అమ్మక తప్పలేదు. అయితే ఆ సమయంలో రవీంద్రన్‌ తన కొడుకు శ్రీజేష్‌కు ఓ మాట చెప్పారు. ‘ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని అమ్మేశా. నువ్వు అనుకున్న కలను సాధించాలి. హాకీలో గోల్‌ కీపర్‌గా మెరవాలి. దేశానికి పతకం తేవాలి’ అని చెప్పారు. తండ్రి మాటలను శ్రీజేష్‌ రెండుసార్లు నెరవేర్చారు.