NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

ప్రజల సమస్యలపై చర్చ పెట్టండి-రేవంత్‌రెడ్డి

కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్ లో 138వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పని చేస్తోందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని తెలిపారు. గాంధీ బలిదానం అయినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

పద్మశ్రీ భాష్యం విజయసారధి ఇకలేరు..

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి పద్మశ్రీ భాష్యం విజయ్ సారథి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ సారథి కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో.. తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మందాకిని కావ్య కవిగా ప్రాచుర్యంలోకి తెచ్చిన శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషలో దిట్ట. రాగయుక్తంగా కవిత్వం చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించి మహాకవిగా ఆయన ప్రశంసలు అందుకున్నారు.

నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు. యూనియన్ ఆఫ్ ఇండియా, ఈడీ, జాయింట్ డైరెక్టర్ ఈడీ, అసిస్టెంట్ డైరెక్టర్ లను రోహిత్ రెడ్డి ప్రతి వాదులుగా చేర్చారు. ECIR 48/2022 క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్ట్ ఆదేశాలు ఇవ్వాలంటు పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడి పాల్పడిందని పిటిషన్ లో తెలిపారు రోహిత్‌ రెడ్డి. ఈడి తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తు పై స్టే ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో నిన్న ఈడీ విచారణకు హాజరుకాలేదు.

నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తి

సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ నెల 24న చలపతిరావు మృతి చెందగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండడంతో ఇంతవరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. మంగళవారం చలపతిరావు కుమార్తెలు హైదరాబాద్‌ చేరుకున్నారు. అందుకే ఈరోజు ఆయన దహన సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ‘గూఢచారి 116’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన చలపతిరావు సహాయ నటుడిగా, విలన్‌గా, హాస్యనటుడిగా 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ చలపతిరావు వరకు ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో వెండితెరను పంచుకున్నారు. చివరగా బంగార్రాజు సినిమాలో చలపతిరావు నటించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తితో ఉన్నారు-వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు

వైసీపీ ప్రభుత్వంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సర్కారుపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కొద్దిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పమని.. లక్షల మంది ఉన్న విద్యార్థులు అనుకుంటే వారి తల్లిదండ్రులతో ఓట్లు వేపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.

త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి.. ఛైర్మన్‌గా భూమన?

త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు.

ఎమ్మెల్యే వరప్రసాదరావుపై అసంతృప్తి

నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు ముదిరింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జెడ్పీటీసీ ఊటుకూరు యామిని రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇదేబాటలో మరికొంతమంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు. సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వైఖరిపై పలువురు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే పదవుల నియామకం చేపట్టారని ఆరోపిస్తున్నారు. పదవి లేకుండా అయినా ఉండగలమేమో కానీ విలువ లేని చోట ఉండలేమని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటున్నారు.

ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్ సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు అపురూప కానుకలు అందజేస్తున్నాడు. తాజాగా మెస్సీ మరోసారి భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ధోనీకి బహుమతి పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపాడు. ఈ జెర్సీని చూసి జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

కాంగ్రెస్ కార్యకర్తలకు భారత్ జోడో యాత్ర “సంజీవిని”

రతదేశ ఆలోచనలు సవాల్ చేయబడుతున్నాయని.. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఏకం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ జెండాను ఎగరేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లే కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు. భారతదేశమ బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా కొన్ని దశాబ్ధాల్లో ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. అయితే ఇదంత తనంతటతానుగా జరగలేదని.. కాంగ్రెస్ పార్టీకి సమ్మిళిత సిద్ధాంత, సమాన హక్కులు, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం వల్లే ఇందతా జరిగిందని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం..

ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని నియంత్రిస్తుందన్నారు. రష్యా యుద్ధభూమిలో ఉందని.. విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
India Unemployment Rate: ఈ ఏడాది డిసెంబర్‌ డేటా. సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ వెల్లడి