చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయిందని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.. తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన ఓపెన్ ఎఐ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.. సంస్థ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించక పోవడంతో, ఆయన పనితీరుపై నమ్మకం లేకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
ఇకపోతే చాట్‌జీపీటీలో బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్. ఏఐ టెక్నాలజీని బింగ్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాడక్ట్స్‌కి కూడా తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చింది.. అయితే కొత్త సీఈఓ ఎవరా అనే ఆలోచనలు జనాల్లో మొదలు కావడంతో సంస్థ ఆ స్థానంలో మీరా మారుతిని నియమించింది. ఆమె.. ఇప్పటివరకు అదే సంస్థలో సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహించారు..
ఇదిలా ఉండగా.. ఆల్ట్మాన్ తనను కంపెనీ నుంచి తొలగించడం పై తాజాగా స్పందించారు.. ఓపెన్ఏఐ టీమ్‌ని నేను ప్రేమించాను. వ్యక్తిగతంగా చాలా వృద్ధి సాధించాను. ప్రపంచానికి కూడా కొంత మంచి చేశానని విశ్వసిస్తున్నాను. అద్భుత టాలెంట్ ఉన్న వారితో పనిచేయడాన్ని ప్రేమించాను, అని ట్విట్టర్ వేదికగా స్పందించారు సామ్ ఆల్ట్మాన్. ఇక సామ్ ఆల్ట్మాన్ని ఫైర్ చేయడంతో.. ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రేగ్ బ్రూక్మాన్కు తన పదవికి రాజీనామా చేశారు.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఓపెన్ఏఐని నా అపార్ట్మెంట్లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా కఠినమైన పరిస్థితులను, సంతోషకరమైన సందర్భాలను ఎదుర్కొన్నాము అని బ్రూక్మాన్ తెలిపారు.. ఇప్పుడు ఈ కంపెనీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారో తెలియాల్సి ఉంది..