NTV Telugu Site icon

విన్ డీజిల్ కొత్త ’రాగం’! ‘కార్ రేసింగ్’ హీరోకి… ‘కచేరి’ చేయాలని ఉందట!

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజ్ కి బిగ్ అట్రాక్షన్ విన్ డీజిల్. మరోసారి అతడే హైలైట్ గా న్యూ ఇన్ స్టాల్మెంట్ వచ్చింది. ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలో దుమారం రేపుతోంది. మిలియన్ల కొద్దీ డాలర్లు కొల్లగొడుతోంది. అయితే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన విన్ డీజిల్ మంచి సంగీత ప్రేమికుడు కూడా! అందుకే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మ్యూజికల్ వర్షన్ చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు!

Read Also: ‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్!

సంగీతమే కాదు… తనకు వివిధ కళల్లో ఉన్న ఆసక్తికి, ప్రతిభకి కుటుంబమే కారణమన్నాడు హాలీవుడ్ సూపర్ స్టార్. విన్ డీజిల్ ఫ్యామిలీలో అందరూ కళాకారులో, కళని ప్రేమించే వారో మాత్రమేనట! దాని వల్లే తనకు ఆర్ట్స్ పట్ల అభిరుచి కలిగిందన్నాడు. ప్రపంచంలోని ఎవరైనా తమకు ఏది ఇష్టమో అదే చేయాలని విన్ చెబుతున్నాడు. వారి వారి ఫ్యామిలీస్ కూడా తనని తన కుటుంబం ఎంకరేజ్ చేసినట్టు చేయాలని అంటున్నాడు. క్రేజీ ఐడియాస్ తో మాత్రమే అద్భుతాలు సృష్టించగలమని ఆయన అభిప్రాయపడ్డాడు…
ఓ చాట్ షోలో మాట్లాడిన విన్ డీజిల్, ఒకప్పుడు స్టీఫెన్ స్పిల్ బర్గ్… తనతో మ్యూజికల్ మూవీ ఒకటి ప్లాన్ చేశాడని చెప్పాడు. అదే ‘గైస్ అండ్ డాల్స్’ మూవీ! కానీ, అందులో దురదృష్టవశాత్తూ నటించలేకపోయానని విన్ బాధపడ్డాడు. చూడాలి మరి, నెక్ట్స్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’లో కనిపించబోతోన్న యాక్షన్ హీరో సంగీత ప్రధాన చిత్రంలో ఎప్పుడు కనిపిస్తాడో…