Site icon NTV Telugu

విక్కీ, లక్ష్మీలను దత్తత తీసుకున్న ఉపాసన

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపసాన ఎప్పుడూ ఏదో ఒక సాంఘీక కార్యక్రమాలు చేస్తుంటుంది. అపోలో ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతలను ఒకపక్క చక్కపెడుతూనే మరో పక్క తన తోచిన విధంగా పేదలకు సాయం చేస్తుంటుంది. అంతేకాకుండా ఉపాసన ఎప్పడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెగా అభిమానులకు రామ్‌చరణ్‌ ముచ్చట్లు కూడా చెబుతుంటుంది.

అయితే తాజాగా ఈ మెగా కోడలు నెహ్రు జూపార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను ఏడాది కాలం దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో జూ క్యూరేటర్‌కు సింహాల పోషణకు సంబంధించిన రూ.2లక్షల చెక్కును ఉపాసన అందజేసింది.

Exit mobile version