గత ఏడాది పొలిటికల్ థ్రిల్లర్ ‘చదరంగం’, హ్యూమరస్ ‘అమృతం ద్వితీయం’, స్పోర్ట్స్ డ్రామా ‘లూజర్’, క్రైమ్ & యాక్షన్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను అందించి, ప్రజల ఆదరణ, అభిమానం సొంతం చేసుకొన్న ‘జీ 5’ ఈ ఏడాది మరో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54 ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా మే 21న స్ట్రీమింగ్ కానుంది.
ఇంజనీరింగ్ చదువుతూ కాలేజీ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 54లో ఉంటున్న నలుగురు కుర్రాళ్ల కథ ఇదని, ఆ రూమ్‌కి ఓ ప్రత్యేకత ఉంటుందని, అందులో ఉన్న వారందరికీ నెక్స్ట్ బ్యాచ్‌లతో ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుందని, ఆ రూమ్‌లో దిగిన నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? అనే కథాంశంతో ఈ వెబ్ సీరిస్ తీశామని దర్శక నిర్మాతలు తెలిపారు. మొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య ఇందులో కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ గౌతమ్ రచన, దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ ను ఐ డ్రీమ్ మీడియా ప్రొడ్యూస్ చేసింది.
మే 21 నుండి ‘రూమ్ నంబర్ 54’
