Site icon NTV Telugu

ఆసక్తికరంగా “క్యాబ్ స్టోరీస్” టీజర్

Teaser of Cab Stories is out now

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతుతో స్పార్క్ అనే కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పార్క్ ఓటిటిలో పలు ఆసక్తికరమైన విడుదల కావటానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ‘క్యాబ్ స్టోరీస్’ ఒకటి. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి, హాస్యనటులు ప్రవీణ్, ధన్ రాజ్, గిరిధర్ తదితరులు నటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవ్వగా… ఆపై మనం చార్మినార్, బుద్ధ విగ్రహాన్ని చూపిస్తూ కొనసాగింది ‘క్యాబ్ స్టోరీస్’ టీజర్. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ…. వారి ప్రయాణం, జీవితంలోని ఎత్తుపల్లాలు, వారు తమ ప్రయాణంలోని స్పీడ్ బ్రేకర్లను ఎలా దాటుకున్నారు ? అనే అంశాలను చూపించబోతున్నారు. టీజర్ చూస్తుంటే సినిమాలో ఆనందం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్నీ అంశాలు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతోంది. ఈ ట్రైలర్ మే 25న విడుదల కానుంది. మే 28 నుండి స్పార్క్ ఓటిటిలో “క్యాబ్ స్టోరీస్” ప్రసారం అవుతుంది.

https://www.youtube.com/watch?v=ZsA5Uz8FjcY
Exit mobile version