ప్రముఖ నటి స్నేహకు కేవలం తమిళంలోనే కాదు… తెలుగులోనూ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. 2012 మే 12న ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా స్నేహ… ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే సినిమాల్లో చేస్తోంది. విశేషం ఏమంటే స్నేహ, ప్రసన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటారు. ఇప్పటికే స్నేహకు ఒక బాబుతో పాటు, యేడాది పాప కూడా ఉంది. సోమవారం నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా స్నేహ తన కొడుకు, కూతురుకు సంబంధించిన రెండు ఫోటోలను పెట్టింది. నిజానికి అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎందుకంటే… తరచూ వాళ్ళు వాళ్ళ పిల్లల ఫోటోలనూ సోషల్ మీడియాలో ఏదో సందర్భంలో పెడుతూనే ఉంటారు. అయితే స్నేహా తన పిల్లల ఫోటోలతో పాటు తన సోదరులు బాలాజీ, గోవింద్ లతో తానున్న ఫోటోలనూ సైతం పోస్ట్ చేసింది. ఆ రకంగా స్నేహ సోదరులు ఆమె ఫ్యాన్స్ కు పరిచయం అయినట్టయ్యింది. ‘నీ అవసరాలలో నీతో ఉండే వాడు, నువ్వు పడిపోతున్నప్పుడు పట్టుకునే వాడు, నీతో ఎవరూ లేనప్పుడు నిన్ను అంటిపెట్టుకుని ఉండే వాడే సోదరుడంటే. మనకు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ బ్రదరే. హ్యాపీ బ్రదర్స్ డే’ అంటూ స్నేహ తన మనసులోని నాలుగు మాటలూ కూడా బయట పెట్టేసింది.
సోదరులను ఫ్యాన్స్ కు పరిచయం చేసిన స్నేహ!
