NTV Telugu Site icon

20 ఏళ్ల వయస్సులో 45 ఏళ్ల నటుడికి తల్లిగా నటించిందట!

Shefali Shah : I was 20 years old when I played a mom of 45

ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీలకు నేరుగా అభిమానులతో మాట్లాడే వెసులుబాటు వచ్చేసింది. వారు అడిగిన ప్రశ్నలకి నటీనటులు తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ షెఫాలీ షా కూడా నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. అందులో ఆమె చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు…

షెఫాలి షా ‘కపూర్ అండ్ సన్స్, నీరజ’ సినిమాల్ని రిజెక్ట్ చేసిందట. కానీ, అవి తరువాత మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇంకా అలాంటి మిస్సైన సినిమాలు చాలానే ఉన్నాయంటూ ఈ 48 ఏళ్ల మిసెస్ తెలిపింది. అయితే, షెఫాలీ గతేడాది తన వద్దకొచ్చే వివిధ రకాల పాత్రల గురించి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె కెరీర్ లో చాలా ఎర్లీగానే మదర్ క్యారెక్టర్స్ రావటం మొదలు పెట్టాయట. ఓ టీవీ షోలో ఆమె 15 ఏళ్ల కొడుక్కి తల్లిగా నటించిందట! అప్పుడు షెఫాలి వయస్సు 20! మరోసారి 45 ఏళ్ల నటుడికి కూడా తల్లిగా నటించిందట. అప్పుడు కూడా ఆయన వయస్సులో ఈమె వయస్సు సగమేనట!

తనకి 30 ఏళ్లు కూడా లేనప్పుడే అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ స్టార్ కి తల్లిగా నటించానని వివరించిన షెఫాలి షా ఇప్పుడు ప్రత్యేకమైన పాత్రలు వస్తేనే ఆసక్తి చూపుతున్నానని చెప్పింది. రొటీన్ మదర్ క్యారెక్టర్స్ పై ఆమె అసహనం వ్యక్త పరిచింది. నిజమే మరి, రంగస్థలం మొదలు టీవీతో సహా వెండితెర దాకా అంతటా తన ప్రతిభని చాటిన ఆమెకి దమ్మున్న పాత్రలు ఇవ్వకపోవటం… ఫిల్మ్ మేకర్స్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి!