పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయినా, మొదటి లిరికల్ వీడియో సాంగ్ సూరీడు కి మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ని చూసిన తర్వాత యాక్షన్, సెటిమెంట్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది.. ఆ పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది..
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీవ్యూ షోను ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు చూసారు.. ఈ ప్రివ్యూ షో నుండి మామూలు రెస్పాన్స్ రాలేదు. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎప్పటి చూడని విధంగా ఉంటుంది అట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఫైట్ సన్నివేశానికి థియేటర్స్ పరిస్థితి ఊహించడానికే సాధ్యం కాదని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో సస్పెన్స్ లు ఉన్నాయని చెబుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముందుగా నైజాం ప్రాంతం లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారని అనుకున్నారు. కానీ కర్ణాటక ప్రాంతం లో ఓపెన్ చేసారు.. అక్కడ టిక్కెట్ బుకింగ్ ను ఓపెన్ చెయ్యగానే హాట్ కేక్ లాగా టిక్కెట్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.. కేవలం 10 నిమిషాల్లోనే పది వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.. వేరే రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల టిక్కెట్లు దొరకడం కష్టమే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..