Site icon NTV Telugu

బోయపాటి అటు… గోపీచంద్ ఇటు…

Repeating Combinations in Tollywood

చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీస్ చేసిన బోయపాటి ఇప్పుడు ‘అఖండ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే మరో వైపున మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు మలినేని గోపీచంద్ ది కూడా సూపర్ హిట్ కాంబినేషనే! వీరిద్దరి కాంబోలో గతంలో ‘డాన్ శీను, బలుపు’ చిత్రాలు వచ్చాయి. మూడో సినిమా జనవరిలో వచ్చిన ‘క్రాక్’ కూడా బాక్సాఫీస్ బరిలో క్రాక్ పుట్టించింది. ఇంతకూ విషయమేంటంటే… త్వరలోనే ఈ ఇద్దరు దర్శకులు అటూ – ఇటూ మారబోతున్నారు. బాలకృష్షతో మూడో సినిమా ‘అఖండ’ను పూర్తి చేసిన వెంటనే బోయపాటి శ్రీను… రవితేజతో ఓ మూవీ చేయనున్నాడట. అలానే రవితేజతో ముచ్చటగా మూడో సినిమాగా ‘క్రాక్’ చేసిన మలినేని గోపీచంద్… ఇప్పుడు బాలకృష్ణతో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరికీ ఇది ఫస్ట్ కాంబినేషన్ కానీ, రవితేజ, బోయపాటి గతంలో కలిసి ‘భద్ర’ మూవీ చేశారు. మరి ఈ ఆ యా హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకులు… తాజా చిత్రాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి!

Exit mobile version