NTV Telugu Site icon

అప్పుడో… ఇప్పుడో… ‘రామారావ్ ఆన్ డ్యూటీ’!

‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీలను రీ షఫిల్ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల తేదీలన్నీ మారిపోయాయి. ఇక ‘గని’ లాంటి సినిమా అయితే రెండు లేదా మూడు వారాల ముందు రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదల విషయంలోనూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందు అనుకున్నట్టు మార్చి 25వ తేదీ లేదంటే ఏప్రిల్ 15న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు శరత్ తెలిపారు.