Site icon NTV Telugu

రణదీప్ హూడా… అప్పటి నోటి దూల ఇప్పుడు పెద్ద గోల!

Randeep Lands In Trouble with Old Video

రణదీప్ హూడా… మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దక్కని నటుడు. అయితే, ఈ మధ్యే ‘రాధే’ సినిమాలో మంచి పాత్ర పోషించి సత్తా చాటాడు. కానీ, అందుకోసం రావాల్సిన గుర్తింపు కోసం కాస్తా ఇప్పుడు మరో కారణం చేత లభిస్తోంది. రణదీప్ ఫేమస్ కాదు… ఇన్ ఫేమస్ అయ్యాడు!

రణదీప్ హూడా కొన్నేళ్ల క్రితం ఓ షోలో పాల్గొన్నాడు. అందులో మాయావతి పేరు చెప్పి మరీ ఓ జోక్ పేల్చాడు. అది రేసిస్ట్, సెక్సిస్ట్ గా ఉందనేది అందరూ ఒప్పుకునే విషయమే! ఒక్కసారి ట్విట్టర్ లోనో, యూట్యూబ్ లోనో మన వాడి ఫ్లాష్ బ్యాక్ కామెడీ చూస్తే ఎవరైనా అంగీకరిస్తారు కూడా. అంత నీచంగా ఉంది అతగాడి వల్గర్ జోక్! మరి ఈ విషయం ట్విట్టర్ యూజర్స్ దృష్టికి వచ్చాక ఊరుకుంటారా? రణదీప్ ని అరెస్ట్ చేయమంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు. ఇంత వరకూ పోలీసులు అతడ్ని అరెస్ట్ అయితే చేయలేదుగానీ రణదీప్ కూడా ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. నెటిజన్స్ మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. చాలా మంది జర్నలిస్టులు, యాక్టివిస్టులు కూడా అరెస్ట్ చేయమంటూ పోస్టులు పెడుతున్నారు!

‘రాధే’ సినిమాలో విలన్ గా నటించిన రణదీప్ హూడా నిజంగానే ఇప్పుడు చాలా మందికి విలన్ అయ్యాడు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version