యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ మూవీ. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి పలు ఊహాగానాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో జోష్ పెంచేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో 2022, ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.