NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్, మారుతి మూవీ నుంచి ఫోటోస్ లీక్..అబ్బా ఏమున్నాడు డార్లింగ్..

Prabas

Prabas

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చాయి.. దాంతో ఇప్పుడు డార్లింగ్ సలార్, కల్కి సినిమాల పై ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ లకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే..మరోవైపు సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది మరో ప్రాజెక్ట్. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న కొత్త గురించి అంతగా అప్డేట్స్ రావడం లేదు. కానీ కొన్నాళ్లుగా ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ మాత్రం నెట్టింట లీక్ అవుతుంటాయి.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో పైట్ సీన్ కు సంబందించిన ఫోటో లీక్ అయ్యింది..

ఒక ఫైట్ లో భాగంగా ప్రభాస్ విలన్స్ తో పోరాడుతున్న సీన్స్ తాలూకు ఫోటోస్ అని తెలుస్తోంది. అయితే అందులో ప్రభాస్ లుక్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఇప్పటివరకు లావుగా ఉన్న డార్లింగ్ ఆ సినిమాలో చాలా సన్నగా, మిస్టర్ పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు..ఇటీవలే ఈ మూవీ నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్ కి సంబంధించిన యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్, మారుతీ ప్రాజెక్ట్ నుంచి ఇలా ఫోటోస్ లీక్ కావడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ ప్రాజెక్ట్ నుంచి ఫోటోస్ లీక్ అయ్యాయి..

ఇకపోతే ఈ సినిమా లీకుల పై సినిమా ఫోకస్ పెట్టింది.. ఇకమీదట ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా వివరాలను టైటిల్, రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తైన తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా.. పవన్ హీరోయిన్ శృతిహాసన్ ప్రభాస్ కు జోడిగా నటించనుంది.. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల కానున్నాయనిఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..