రేణు దేశాయ్ ని కడుపుబ్బా నవ్వించే లిటిల్ ఏంజిల్ ఎవరో తెలుసా? మరెవరో కాదు… మన జూనియర్ పవర్ స్టార్… అకీరా నందన్! ఈ విషయం స్వయంగా రేణూనే ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పింది. తాజాగా ఆమె అకీరాతో కలసి తీసుకున్న ఒక సెల్ఫీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తల్లీకొడుకులిద్దరూ సంతోషంగా నవ్వేస్తున్నారు. అటువంటి హ్యాపీ మూడ్ లవ్లీ పిక్ పక్కన… ‘’ ప్రపంచంలో… నా బుగ్గలు నొప్పి పెట్టేదాకా నన్ను నవ్వించే ఏకైక వ్యక్తి అకీరా! తనకి కూడా నాకున్నంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అందుకే, తన జోక్స్ కి నవ్వేప్పుడు నా జోక్స్ కి నేనే నవ్వుకున్నట్టు అనిపిస్తుంది! నా లిటిల్ ఏంజిల్ ని మీరూ బ్లెస్ చేయండి… ‘’ అని రాసింది.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్లో అకీరా పెద్దవాడు. అతనికి ఓ చెల్లెలు, ఆద్య కూడా ఉంది. అయితే, తన ఇద్దరు సంతానంతో మహారాష్ట్రలో ఉంటోన్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అకీరా నందన్ కూడా ఈ మధ్య యాక్టివ్ అయ్యాడు. అంతే కాదు, ఈ టాల్ టీనేజ్ సెన్సేషన్ ఎక్కడ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చినా పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. ఆ మధ్య మెగా డాటర్ నిహారిక పెళ్లిలో మన జూనియర్ పవనే అందరిలోనూ హైలైట్ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం తన మ్యూజిక్ టీచర్ అండ్ డాడ్ కళ్యాణ్ తో అకీరా దిగిన ఫోటో సైతం సొషల్ మీడియాలో వైరల్ అయింది. చూడాలి మరి, ఇప్పటికే మెగా ఫ్యాన్స్ రా రమ్మని పిలుస్తోన్నా… అకీరా వెండితెర మీదకి ఎప్పుడు వస్తాడో!
అమ్మ, అకీరా, ఆనందం…
