Site icon NTV Telugu

ఏఆర్ రెహ్మాన్ ను తన బయోపిక్ తీయాలని కోరిన పి.సుశీల

P Susheela wants AR Rahman to help make her biopic

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన బయోపిక్ చేయాలని ఆమె రెహమాన్‌ను రిక్వెస్ట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ “రీసెంట్ గా నేను సుశీలమ్మతో మాట్లాడాను. ఆమెను “99 సాంగ్స్” మూవీ చూసారా ? అని అడిగాను. ఒకవేళ ఇంకా సినిమాను చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో చూడమని చెప్పాను. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో సుశీలమ్మకు చూపించమని రిక్వెస్ట్ చేశాను. సినిమా చూసిన తరువాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్‌ను “99 సాంగ్స్” చిత్రంలా చేయమని ఆమె నన్ను కోరింది”అని తెలిపారు. సుశీలమ్మ ప్రశంసలు కురిపించడంతో రెహమాన్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. మరి ఆయన సుశీలమ్మ బయోపిక్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి.

Exit mobile version