న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన సంతాపం వ్యక్తం చేశారు.