బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ – అతని భార్య ఆలియా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే భర్తకు డైవర్స్ ఇవ్వాలని తాను అనుకోవడం లేదని ఆలియా ఆ తర్వాత స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న ఒకానొక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే… ఇండియాలో జరుగుతున్న ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా తన పిల్లలకు సరైన శిక్షణ లభించడం లేదని, వార బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయిందని ఆలియా వర్రీ అవుతోందట. అందుకే పిల్లల చదువును క్లాస్ రూమ్స్ లో కొనసాగించాలని కోరుకుంటోందట. అయితే అది ఇక్కడ కాదు… దుబాయ్ లో! ప్రస్తుతం కరోనా కారణంగా భారత్ అంత సేఫ్ కాదనే ధోరణిలో ఆలియా మాట్లాడుతోంది. దుబాయ్ లోని ప్రజలంతా దాదాపుగా వాక్సిన్ వేయించుకున్నారని, అందుకే అక్కడ ఫిజికల్ గానే తరగతులకు విద్యార్థులను హాజరు కానిస్తున్నారని ఆలియా తెలిపింది. అందుకే వచ్చే నెలలో పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్ళబోతున్నానని, నవాజ్ కు తన అవసరం పడినప్పుడు ఇండియా వస్తుంటానని తెలిపింది. దుబాయ్ లో ఉన్న ఆమె మేనకోడలు ఆలియా ఇద్దరు పిల్లలకు సంబంధించిన స్కూల్ ఎడ్మిషన్ పనులను పర్యవేక్షిస్తోందట. విశేషం ఏమంటే… ఈ మధ్యే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూ యు.ఎ.ఇ. లో నివాసం ఉండటానికి గోల్డెన్ వీసా లభించింది. ఐదేళ్ళ పాటు సంజయ్ దత్ ఫ్యామిలీ అక్కడే ఉండే ఆస్కారం ఉంది. అదే సమయంలో సంజూ వైద్యం కూడా చేయించుకుంటాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… నవాజుద్దీన్ సిద్ధికి పిల్లలు ఎంతకాలం దుబాయ్ లో ఉంటారో తెలియదు, కానీ ఈ విద్యాసంవత్సరంలో మాత్రం అక్కడి స్కూల్స్ లో చేరడం ఖాయం.
ఆ హీరోగారు ఇక్కడ… పిల్లలు దుబాయ్ లో!!
