నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) అనారోగ్యంతో జూన్ 10వ తేదీ కన్నుమూశారు. లెజండరీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అలానే ఆయనకు కొంతకాలంగా డయాలసిస్ జరుగుతోంది. బుద్ధదేవ్ దాస్ గుప్తా మృతి వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. దర్శకుడిగా సమాజంలోని అన్ని పార్శ్వాలను బుద్ధదేవ్ స్పృశించారని ప్రధాని పేర్కొనగా, ఆయన లేని లోటు చిత్రసీమకు పూడ్చలేనిదని మమత అన్నారు. 1980, 90 ప్రాంతంలో అప్పటి ఉత్తమ దర్శకులు గౌతమ్ ఘోష్, అపర్ణ సేన్ లో కలిసి సమాంతర సినిమాల రూపకల్పనకు బుద్ధదేవ్ దాస్ గుప్తా విశేషంగా కృషి చేశారు. ఆయన రూపొందించిన బాగ్ బహదూర్ (1989), చరాచర్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002), కాలపురుష్ (2008) ఉత్తమ చిత్రాలుగా జాతీయ అవార్డుకు ఎంపికైనాయి. 1978లో రూపొందించినదూరత్వ, 1993లో తీసినతహదీర్ కథచిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ బెంగాలీ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి. అలానేఉత్తర(2000),స్వప్నర్ దిన్(2005) చిత్రాలకు గానూ ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ సమాజంపై నక్సలిజం ప్రభావంపై ఎలా ఉందోదూరత్వ, గృహజుద్థ, అంథీ గలీ` చిత్రాలలో బుద్ధదేవ్ దాస్ గుప్తా చూపించారు.
Also Read
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!