ప్రముఖ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) అనారోగ్యంతో జూన్ 10వ తేదీ కన్నుమూశారు. లెజండరీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అలానే ఆయనకు కొంతకాలంగా డయాలసిస్ జరుగుతోంది. బుద్ధదేవ్ దాస్ గుప్తా మృతి వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. దర్శకుడిగా సమాజంలోని అన్ని పార్శ్వాలను బుద్ధదేవ్ స్పృశించారని ప్రధాని పేర్కొనగా, ఆయన లేని లోటు చిత్రసీమకు పూడ్చలేనిదని మమత అన్నారు. 1980, 90 ప్రాంతంలో అప్పటి ఉత్తమ దర్శకులు గౌతమ్ ఘోష్, అపర్ణ సేన్ లో కలిసి సమాంతర సినిమాల రూపకల్పనకు బుద్ధదేవ్ దాస్ గుప్తా విశేషంగా కృషి చేశారు. ఆయన రూపొందించిన బాగ్ బహదూర్ (1989), చరాచర్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002), కాలపురుష్ (2008) ఉత్తమ చిత్రాలుగా జాతీయ అవార్డుకు ఎంపికైనాయి. 1978లో రూపొందించిన
దూరత్వ, 1993లో తీసిన
తహదీర్ కథచిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ బెంగాలీ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి. అలానే
ఉత్తర(2000),
స్వప్నర్ దిన్(2005) చిత్రాలకు గానూ ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ సమాజంపై నక్సలిజం ప్రభావంపై ఎలా ఉందో
దూరత్వ, గృహజుద్థ, అంథీ గలీ` చిత్రాలలో బుద్ధదేవ్ దాస్ గుప్తా చూపించారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కన్నుమూత!
Show comments