NTV Telugu Site icon

వెంకీ కుడుముల దర్శకత్వంలో చైతు!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తెలుగు అబ్బాయిగా చైతూ కనిపిస్తాడట. అంతే కాదు గెస్ట్ రోల్ అయినా దాదాపు 20 నిమిషాల వరకూ ఇతగాడి పాత్ర ఉంటుందట. జూన్ నుంచి లఢఖ్ లో ఈ సినిమా షూటింగ్ ఉంటుందట. ఇదిలా ఉంటే నాగచైతన్య వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నాడట. వెంకీ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వెంకీ మెగా హీరో వరుణ్‌ తేజ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ముందుగా వెంకీ మెగా హీరో సినిమా చేస్తాడా? లేక ఆక్కినేని వారబ్బాయితో ముందుకు వెళతాడా అన్నది తేలాల్సి ఉంది.