బెల్లంకొండ గణేశ్ తో ‘నాంది’ నిర్మాత సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణు, బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను కొంత కాలం క్రితం ప్రారంభించారు. అయితే… అది కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ సినిమాకు రథన్ సంగీతం అందిస్తుండగా, ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ సంభాషణలు రాశారు. కానీ ఎందుకో ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను దర్శక నిర్మాతలు కొంతకాలంగా ఇవ్వడంలేదు.
ఇదిలా ఉంటే… బెల్లంకొండ సాయి గణేశ్ తో ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సతీశ్ వేగేశ్న మూవీ నిర్మించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తొలి యత్నంగా సతీశ్ వేగేశ్న తీసిన ‘నాంది’ నిర్మాతగా అతనికి, హీరో నరేశ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతోనే బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ తో సతీశ్ మూవీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారట. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ప్రతిభావంతుడైన యువ దర్శకుడు కృష్ణ చైతన్య దీనికి కథను అందిస్తున్నారట. నిజానికి ఈ సమయంలో కృష్ణ చైతన్య హీరో నితిన్ తో ‘పవర్ పేట’ మూవీ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అతి త్వరలోనే బెల్లంకొండ గణేశ్ – సతీశ్ వేగేశ్న మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Also Read
తాజావార్తలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!